-
-
మా కేరళ యాత్ర
Maa Kerala Yatra
Author: Muthevi Ravindranath
Publisher: Vignana Vedika
Pages: 304Language: Telugu
‘దక్షిణ భారత దేశపు స్వర్గం’గా పేరొందిన కేరళలో పర్యటించాలనుకునేవారికీ, ఆ రాష్ట్రంలోని సుందరమైన పర్యాటక ప్రదేశాల గురించి సమగ్రంగా తెలుసుకోవాలనుకునే వారికీ ఈ పుస్తకం ఒక అద్భుతమైన కరదీపిక. అక్కడి పర్వతాలు, జలపాతాలు, సరస్సులు, సముద్రతీరాలు, జంతు, పక్షి అభయారణ్యాలు, చెట్టుచేమలు – ఇలా ఒకటేమిటి? అరుదైన జీవ వైవిధ్యంతో కూడిన అక్కడి ప్రకృతి సౌందర్యం మొత్తాన్నీ మీ కళ్ళముందు నిలుపుతుందీ పుస్తకం. ఇది చదివితే అక్కడి చారిత్రక ప్రదేశాలు, ప్రార్థనా మందిరాలు, రాజప్రాసాదాలు, మ్యూజియంలు మొదలైనవన్నీ మీరే స్వయంగా తిరిగి చూసిన అనుభూతిని పొందుతారు. మలయాళీల చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, ఆహారాలు, కులమతాలు, పండుగలు, కేరళకే ప్రత్యేకమైన ‘కథకళి’ మొదలైన సంప్రదాయ నృత్యరీతులు, ‘కళరి పయట్టు’ వంటి యుద్ధ విద్యలు మొదలైన వాటిని లోతుగా పరిశీలించాలనుకునే వారికి ఇదో విలువైన ఆధార గ్రంథం. ‘తెనాలి రామకృష్ణ కవి’, ‘శ్రమవీరులు’, ఇలియడ్’, ‘కూరగాథలు’, ‘ఇంటింటి వైద్యం’, ‘దేవుడున్నాడా?’ వంటి తన విశ్లేషణాత్మక రచనలతో పాఠకులను మెప్పించిన రచయిత ప్రతిభకు ఈ పుస్తకం తాజా సాక్ష్యం.
- ప్రచురణకర్తలు
please inform when print book is available
pavankumar.co.in@gmail.com
Looking for printed book.