-
-
మా దిగువ గోదారి కథలు
Maa Diguva Godari Kathalu
Author: Vamsy
Publisher: Ilios India Pvt. Ltd.
Pages: 521Language: Telugu
ఈ దిగువ గోదారి కథలు రాయడానికి ముందు వంశీగారు అధ్యయనం చేసుకోడం కోసం కొన్ని నెలల పాటు కారుల్లోనూ పడవల మీద ప్రయాణం చేసి ఇక్కడున్న గ్రామాలూ, పల్లెలు, లంకల్లోనూ మకాం చేసి ఇక్కడి జీవితాల్ని కళ్ళారా చూసి, వింతలూ, విడ్డూరాలను అక్కడ ప్రజలు చెప్పగా చెవులారా విని, స్పందించి రాసిన ఈ కథల్లో రసపుష్టిని సమకూర్చడానికి కాస్త ఫిక్షను కలిపి అందరికీ ఆసక్తికరంగా వుండేలా రాశారు ఈ దిగువ గోదారి కథలు.
1980 దశకంలో బాపూ చేతిలో ఎప్పుడూ ఒక ఇంగ్లీషు నవల వుండేది. దాన్ని తాయిలంలా దాచుకుని ఖాళీ దొరికినప్పుడల్లా చదివేవాడు. అలా చదివేసిన ‘డెస్మండ్ బేగ్లీ’, ‘హేమండ్ ఇన్సు’, ‘అలస్టర్ మెక్లీన్’ లాంటి రచయితల నవలలు ఎన్నో నాకిచ్చేసేవాడు. కొన్ని మిలియన్ల కాపీలు ప్రపంచవ్యాప్తంగా అమ్ముడయ్యాయంటే వారు రాసిన పద్ధతి వల్లే. దేశదేశాలు పర్యటించి అవన్నీ తమ వర్ణనలతో కథాశంలో పొందుపర్చడమే ముఖ్య కారణం. సరిగ్గా అలాగే వున్నాయి వంశీగారి కథలు.
కథలో పాత్రలకు ఇంటిపేర్లతో సహా పేర్లు పెట్టడం ఆయనకు అలవాటు. ఆయన పెట్టే పేర్లు ఆయా పాత్రల స్వభావానికి దగ్గరగా వుంటాయి. అలాగే ఆయన వర్ణించే వూర్లు, లంకలూ, రోడ్లూ, వీధులూ, పుంతలూ నిజంగా అక్కడున్నవే. వాటి జాగ్రఫీలో కాని, టోపోగ్రఫీలో కాని అసలు తేడాలుండవు.
అలాగే దిగువ గోదావరి వంటకాలు, వాటి రుచి మనకు చవి చూపుతారు. పూతరేకులు లగాయితు, వేరు పనసపండు తొనలు, పొటెక్కలు, ఉప్మా పెసరట్లు, రొయ్యల గార్లు వగైరాలను నోరూరేలా వర్ణిస్తారు.
ఈ కథలన్నిటికీ బాపూ వేసిన బొమ్మలు మామూలు బొమ్మలు కావు, రూపానువాదాలు, టీకా తాత్పర్యాలు, అద్భుత వాఖ్యానాలు.
- బి.వి.ఎస్.రామారావు(సీతారాముడు)
గమనిక: "మా దిగువ గోదారి కథలు" ఈబుక్ సైజు 23.2 mb
Please provide rent option
Please give rent option.
Have you removed the rent option?. See, most of the ebooks of this author are costlier than the print books available in market and they are also offering a minimum 10% reduction for print books .
మరీ కాస్ట్లీ అండీ