-
-
ఎమ్మెస్వీ కథలు
MSV Kathalu
Author: MSV Ganga Raju
Publisher: J.V.Publications
Pages: 224Language: Telugu
Description
ఆత్మీయత, ఆర్ద్రత, త్యాగం, మంచితనం, సౌహార్ధం, స్నేహం, దయ – యిలాంటి సార్వజనీనమైన పనిముట్లు - ఆయన రచనలకు పెట్టుబడి. హాయిగా, తృప్తిగా, ఉల్లిపాయ పకోడీల్లాగ ‘ఆహా!’, ‘ఓహో!’ అని చదివిస్తాయి. చదివేక చాలాకాలం వెన్నాడుతాయి. ఇది ఆయా రచనలకు రచయిత అబ్బించిన పరిమళం! ఈ గంగరాజుగారు మంచి మధ్య తరగతి రచయిత!
- గొల్లపూడి మారుతీరావు
ఇజాల కన్నా జీవిత నిజాలే గొప్పవని నమ్మే నిజాయితీ కథకుడు ఎమ్మెస్వీ!
సమకాలీన సమాజంలో ఎదురు పడే సంఘటనలను కథా వస్తువులుగా తీసుకుని పాఠకుల మనసుల్ని సున్నితంగా స్పృశించే కథనాలు అల్లడంలో ఎమ్మెస్వీ దిట్టి!
ఆయన రచనల్లో సున్నితమైన మానవీయ విలువలు అంతర్లీనంగా కనిపిస్తాయి. ఇజాల చట్రంలో ఇమిడి పోకుండా తెలుగు కథకి స్వేచ్ఛనిచ్చి జీవిత నిజాలను తన పాత్రల ద్వారా పలికిస్తారు.
- ‘ఈనాడు’ దినపత్రిక
Preview download free pdf of this Telugu book is available at MSV Kathalu
Login to add a comment
Subscribe to latest comments
