-
-
ఎమ్ ఎస్ ఆఫీస్ 2007/2010
M S Office 2007 2010
Author: Chitrapu Surya Srinivas
Publisher: Swathi Book House
Pages: 260Language: Telugu
విండోస్ ఎమ్ ఎస్ ఆఫీస్ పుస్తకం కంప్యూటర్ ఒక పాఠ్యాంశంగా చదువు కొనే డిగ్రీ స్థాయి విద్యార్థులకి, ఆఫీసులలో కంప్యూటర్ పై పని చేయవలసిన అవసరం వున్న వారికి, కంప్యూటర్ గురించి కొన్ని ప్రాధమిక అంశాలు తెలుసుకొని వానిని సాధారణ అవసరాలకు వినియోగించడం ఎలాగో నేర్చుకొవాలనుకొనే ఔత్సాహికులకు ఇలా వేర్వేరు వర్గాలవారికి ఉపయోగపడే విధంగా వ్రాయడం జరిగింది. అందుచేతనే ప్రచురణ నాటికి అధిక ప్రాచుర్యంలో ఉన్న విండోస్ ఎక్స్‌పి ఆపరేటింగ్ సిస్టమ్ మరియు ఎమ్ఎస్ఆఫీస్ ఎక్స్‌పి వెర్షన్లను అనుసరించి వ్రాయబడింది.
టెక్సాలజీ రంగంలో ముఖ్యంగా కంప్యూటర్ సాఫ్ట్వేర్ రంగంలో మార్పు సహజం, సర్వసమాన్యం కొత్త నీరు వచ్చి కొత్త నీరు కొట్టుకుపోతుంది. అన్నట్టు కొత్త వెర్షన్లు వినియోగంలోకి వచ్చి పాతవి కనుమరుగై పోతూంటాయి. ఈ పుస్తకం తొలి ప్రచురణ తరువాత ఆపరేటింగ్ సిస్టమ్స్ విభాగంలో విండోస్ 7 ఆఫీస్ స్కూల్స్ విభాగంలో 2007 మరియు 2010 వెర్షన్లు ప్రాచుర్యంలోకి వచ్చాయి. అయితే మార్కెట్ పరంగా మార్పులు జరిగేంత వేగంగా విద్యారంగంలో మార్పులు జరగవు. డిగ్రీ స్థాయిలో పాఠ్యాంశాలలో ఇంకా పాత వెర్షన్లను అనుసరించడం జరుగుతోంది. ఆ కారణంగానే పుస్తకంలోని మౌలిక అంశాలను పెద్దగా మార్చకుండా అదే సమయంలో కొత్త వెర్షన్లు వినియోస్తున్నవారికి, నేర్చుకొవాలనుకుంటున్న వారికి కూడా ప్రయోజనకరంగా ఉండే విధంగా తీర్చిదిద్దబడింది.
- ప్రచురణకర్తలు
