• Lolopala
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • లోలోపల

    Lolopala

    Pages: 110
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

''ఆర్థికంగా నాకన్నా వాళ్ళ పరిస్థితి బాగుండొచ్చు... సరదాని, సౌఖ్యాన్ని పెంచి పోషించుకునే అవకాశం ఉండొచ్చు. కానీ నాలాంటి పిల్ల ఏ పరిస్థితులవల్ల రోడ్డు మీద ఇంత యాతన పడుతుందో... ఈ పిల్ల యాతనని మరింత పెంచటం అమానుషం అని వాళ్ళకి ఎందుకు అనిపించదో...అన్నదే అసలు ఇబ్బంది అంకుల్‌... అయినా ఓ.కె, లైఫ్‌ స్ట్రగుల్‌ తప్పదు. కనీసం ఇవాళ ఈ రకంగానేనా మీతో చెప్పుకోగలిగాను. ఇంట్లో అమ్మా నాన్నకి చెప్పుకోలేను. చెపితే... ప్రాణంగా నన్ను పెంచుకున్న నాన్న గుండెలు పగిలిపోతాయి. ఎంతో అభిమానంగా ఉండే అమ్మ విలవిలాడిపోతుంది. రోడ్డుమీద ఇలా నిలబెట్టే ఈ డబ్బు వద్దని ఇల్లు కదలనివ్వరు. జీవితమంతా కష్టపడి, ఇంక కష్టపడే ఓపిక, అవకాశంలేని వాళ్ళకి ఇదంతా చెప్పలేను. మనకి మగపిల్లలు లేరే అన్న ఫీలింగ్‌ వాళ్ళకి రాకూడదు. మీరు పిలిచి కూచోమన్న ఆదరణ ఎంతో హాయిగా అనిపించింది. అందుకే ఇదంతా... బరువైన బ్యాగ్‌ మొయ్యటం, ఎండలో నిలబడటం... ఈ ఫిజికల్‌ స్ట్రెయిన్‌ కాదు అసలు బాధ...'' అంది రాణీ. ఆ పిల్లవేపే చూస్తుంటే నెమ్మదిగా నవ్వింది.

రాణీ నవ్వులో సంతోషం లేకపోవచ్చు... కానీ గొప్ప ధైర్యం ఉంది. సముద్రమంత దుఃఖం అంచులు దాటకుండ కదులుతున్న ఆ పిల్ల కన్నీటి తెరలో... ఎంత అనుభవం... ఎంత ఆలోచన... ఎంతటి పెద్దరికం... అందరు పిల్లలూ ఇలా ఉంటే ఎంత బావుంటుంది. కొద్ది నిముషాల్లో ఎంత జీవితం. ఎన్ని రకాల పరిస్థితులు కలగలుపు... ఓ ఎ.టి.ఎం. ముందు...

Preview download free pdf of this Telugu book is available at Lolopala