-
-
లోకాస్సమస్తా...
Lokaassamastaa
Author: Varchaswi L. Putcha
Publisher: Varchaswi L. Putcha
Pages: 159Language: Telugu
ఈ గణ'తంత్రం'లో
చెడిన వీణా తంత్రుల్లా... నా ప్రజలస్వతంత్రులు!
ఏ వాయిద్యమో కాదు సమస్య...
అది వినిపించే 'అను'రాగం ముఖ్యం నా ప్రజలికిప్పుడు!!
- వర్చస్వి
* * *
వర్చస్వి కవిత్వం రాసేందుకు పెద్ద పెద్ద కారణాలు వెతుక్కోడు....
అంతరించిపోతున్న పిచ్చి పిచ్చుక కంఠం అప్పుడప్పుడు రెచ్చగొడితే చాలు!...
ఏ నది ఒడ్డునో సుతారంగా వొళ్ళో రాలే రెల్లు పూలు గిల్లికజ్జాలాడుతూ ఘొల్లుమంటే చాలు....
- యశస్వి
* * *
"ఎవరి కవితలు చిత్రాలో అతడే కవి; ఎవరి చిత్రాలు కవితలో అతడే చిత్రకారుడు" అని ఒక మహా కవి అన్నాడు.
వర్చస్విలో ఆ రెండూ ఉండడం తెలుగు సాహిత్యం అదృష్టం.
- రాళ్ళబండి కవితాప్రసాద్
* * *
కదిలిపోయే, కరిగిపోయేతనం వున్న వాడవడం చేత, ప్రతి సందర్భానికి, సంఘటనకి, స్పందనకి అక్షరాన్నే ఆశ్రయించాడు. ఇటువంటి ఉద్వేగభరిత క్షణాలే వర్చస్వి కవిత్వం.
- యాకుబ్
* * *
'స్పృహ' కలిగిన 'సృజనశీలి' వర్చస్వి. ప్రకృతిని, మానవ ప్రకృతినీ కూడా గ్రహించి, ఆ పర్యావరణ వికృతులను అధిగమించి, ప్రేమైక రస పుష్పాలుగా వికసించి, మానవాళి సమస్త సుఖాలనూ, ఆనందాలను ఒడిసిపట్టాలన్నదే కవి ఆకాంక్ష.
- సుధామ
* * *
వర్చస్వి అభివ్యక్తి నవ్యతకు అద్దం పడుతోంది. 'కవితావచస్వి'గా రూపొందుతున్నందుకు హార్దికాభినందనలు.
- డా. సి. నారాయణరెడ్డి
