-
-
లాక్డౌన్ వెతలు
Lockdown Vetalu
Author: Athaluri Vijayalakshmi
Publisher: Rajeswari Prachuranlu
Pages: 110Language: Telugu
కర్ఫ్యూ తెలుసు...
144 సెక్షన్ తెలుసు..
నా అరవై ఏళ్ల వయస్సులో అనేక కర్ఫ్యూ రోజులు చూశాను. చిన్నప్పుడు అబ్బ ఇంకా కొన్ని రోజులు ఈ కర్ఫ్యూ ఉంటే బాగుండు, స్కూల్‌కి వెళ్లక్కరలేదు అనుకున్న రోజులు కూడా గుర్తున్నాయి.
కానీ, ఇలాంటి భయానకమైన రోజుల్ని చూడలేదు. నిర్మానుష్యమైన రోడ్లను, భయంతో, రేపటి గురించిన చింతతో పిల్లలను చంకన, మూటలను నెత్తిన పెట్టుకొని మైళ్ళకు మైళ్ళు నడిచి సొంత ఊరికి పయనమైన వలస కార్మికులు, ఉన్నపాటున ఉపాధి కోల్పోయి దిక్కు లేకుండా అయిపోయిన చిరుద్యోగుల కన్నీళ్లు, ఇల్లు, వాకిలి లేక పేవ్మెంట్స్ మీద జీవితాలు వెళ్లబుచ్చే అనేక మంది అనాధల ఆకలి కేకలు, ఎన్నెన్నో హృదయవిదారక దృశ్యాలు...
జీవితం అంటే ఏమిటి అనే ప్రశ్నకి మాటల్లో లేని సమాధానం మీడియా చూపించింది. ఈ పరిస్థితుల్లో ఆవేదనతో విలవిలలాడే నా అభిమానులకి, నా పాఠకులకి కొంత సేపన్నా చిరుజల్లులాంటి ఓదార్పు నివ్వడానికి, కొన్ని పూరేకులు, మరికొన్ని పూతరేకులు కలిపి
అందించిన చిరుకానుక నా ఈ 'లాక్డౌన్ వెతలు'.
- అత్తలూరి విజయలక్ష్మి
