-
-
లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్
Life is Beautiful
Author: Saili
Publisher: Victory Publishers
Pages: 119Language: Telugu
నా జీవితంలోనూ కష్టాలున్నాయ్, కన్నీరున్నాయ్, అవరోధాలున్నాయ్.
వీటన్నింటినీ జయించే తరుణంలో.. నా మనసు క్షీరసాగర మధనమే అయింది. ఆ తరుణంలో జనించిన, జ్వలించిన, ఉద్భవించిన ఆలోచనలనెప్పుడూ ఓ డైరీలో అక్షర రూపంలో దాచుకుంటాను. ఆ అక్షరాలు నా గుండె ఊసులు. ఆ పదాలు నా మనోజనితాలు. ఆ వాక్యాలు నా అనుభవాల సారాలు.
ఎందుకో ఈసారి మీకు నేను వ్రాసుకున్న నా మాటలు, నా మూగభాషలు, నా మనో వేదనలు, నా జీవిత ప్రతిపాదనలు మీ ముందుంచాలనిపించింది. అవి నా జీవితాన్ని మలుపు తిప్పిన మధుర భాషణలు. ఎందరో జీవితాలను కాచివడపోసి సమస్యల వలయాల నుంచి వార్ని బయటకు తీసుకువచ్చినపుడు... నా మనసులో అంకురించిన అద్బుత వేదాలు. వ్రాసే సమయంలో అవి నా మనోభీష్టాలు. నా వారైన మీతో... నా మనోభీష్టాలను పంచుకోవాలనిపించింది.
ఎందుకో, ఇలా మూగగా జీవితంలో ఓ మూలగా ఏకాంతంలో వ్రాసుకున్న వాక్యాలు వేల వేల సంఖ్యలో ఉన్నాయి. వాటిలో కొన్నింటిని మీ ముందుచుతాను...
- రచయిత
