-
-
లైసెన్స్ టు కిల్
Licence to Kill
Author: Madhubabu
Publisher: Madhubabu Publications
Pages: 138Language: Telugu
"నీ సమాధానం మాకు నచ్చలేదు రాజూ! జేమ్స్ సంగతి చూస్తున్నావుగా, అతని మనస్సు మారాలంటే యింకా బలమైన కారణాన్ని చూపించాలి. కాని, బేసికల్గా కావాల్సిన మెంటల్ స్టెబిలిటీ లేకపోతే నువ్వు ఎందుకూ పనికిరావు. నన్ను చంపినంత పనిచేశావు. అది మర్చిపోవటం చాలా కష్టం.”
"నో.... మిమ్మల్ని చంపటం నా ధ్యేయంకాదు.” తల తిప్పుతూ బొంకాడు షాడో. ఎగతాళిగా నవ్వారు వారందరూ.... అదోమాదిరిగా చూస్తూ లేచి కుర్చీ దగ్గిరకివచ్చాడు సైమన్.
"క్లారిస్సా సమయానికివచ్చి రక్షించింది కాబట్టి బ్రతికి పోయాను. ఎందుకు అనవసరమైన అసత్య ప్రలాపాలాడతావ్?” అన్నాడు ఎదురుగా నిలబడి.
"నేనేదో మెంటల్ షాక్లో వుండబట్టి బ్రతికిపోయావ్. అసలు చంపటమే నా ధ్యేయం అయితే రెండుక్షణాలలో మెడ విరిచి అవతలపడవేసేవాణ్ణి.” జంకూ గొంకూ లేకుండా కళ్ళలోకి చూస్తూ అన్నాడు షాడో.
"నీ మాటలను నమ్మను. అబద్దాలు చెప్పటానికి కూడా లిమిట్ వుంది. జేమ్స్....నీ పని కానీ....” అసహ్యంగా చూస్తూ జేమ్స్కి సైగచేశాడు సైమన్.
This book is now available in Tenglish script with kinige. For details, click the link.