-
-
లెవెల్ 6 లీడర్షిప్
Level 6 Leadership
Author: Venu Bhagavan
Publisher: Grow Tenx
Pages: 136Language: Telugu
నిదానంగా ఆచి తూచి ఆలోచించవచ్చేమో కానీ అడుగులు మాత్రం వడి వడిగా పడవలసిన సమయం ఇది. భవిష్యత్ ప్రణాళికలు రచించడానికి, కార్పొరేట్లో కన్సల్టెంట్స్ ఉండవచ్చు. సామాన్యునికి అవసరం లేకపోవచ్చు. కానీ ఒక సాంప్రదాయ పద్ధతిలో వ్యవస్థను స్థాపించి ఒక స్థాయికి చేరిన చాలా సంస్థలు నేడు ప్రపంచ వేగాన్ని అందుకోవడంలో సందిగ్ధంలో ఉన్నాయి. సమస్యలు, సవాళ్ళ పరిష్కార చట్రంలో ఇరుక్కోకుండా అభివృద్ధి పథం వైపు దూసుకువెళ్ళడానికి కావలసింది ఎనర్జీ. అది అందరికంటే ముందుగా నాయకునిలో ఉండాలి. సాంప్రదాయక పద్ధతిలో కాకుండా ఒక ప్రభావవంతమైన ఆలోచనా విధానం ఒక స్వప్న సృష్టికి, సాకారానికి దారితీస్తుంది. ఇంతవరకూ అందరూ విజన్ అనే పదం పదే పదే విన్నారు కానీ ఆ విజన్‌ను సాకారం చేసే టెక్నాలజీ చాలామందికి తెలియదు. వ్యాపారవేత్తను, వ్యవస్థాపకునిగా ఆలోచింపచేసే లెవెల్ 6 లీడర్షిప్ (6వ స్థాయి నాయకత్వానికి) మా ఆహ్వానం.
- పబ్లిషర్స్
