-
-
లెనిన్ జీవిత కథలు
Lenin Jeevitha Kathalu
Author: Mahidhara Jaganmohana Rao
Publisher: Kavya Publishing House
Pages: 80Language: Telugu
పిల్లలకోమాట
ఈ పుస్తకం మీ కోసమే తయారుచేసేం. ఇది చదివి, మీరేమనుకుంటున్నారో వ్రాయండేం, మరచిపోక. మీకోసం వ్రాసిన పుస్తకం, మీకు పనికివస్తూందో, లేదో, నేను తెలుసుకోవద్దూ? మీరు యిటువంటి పుస్తకాల కోసం ఉత్సాహపడతారని తెలుసు. అందుకనే యికనుంచి మీకోసం ప్రత్యేకంగా చిన్నపుస్తకాలు తెస్తాం. వీలైనంతవరకూ బొమ్మలతో.
మనందరి అభివృద్ధికోసం తమ జీవితాలను అంకితంచేసిన మహనీయు లెందరో వున్నారు. వాళ్ళందరినీ గూర్చి మీకు చెప్పడానికి వస్తుంటాయి, పుస్తకాలు.
మన తెలుగుభాషలో బిడ్డలకోసం పుస్తకాలు తక్కువ. పిల్లల్నిగూర్చి, అత్యంత శ్రద్ధ వహించిన దేశం - ఇప్పటికీ ఒక్కటే వుంది. అదే సోవియటు రష్యా. అటువంటి సోవియటును స్థాపించి, వృద్ధిచేసిన మహాత్ముడు లెనిన్. ఆయన మనందరికీ పూజనీయుడు. ఆయనలోని మంచిగుణాలూ, మంచిభావాలూ మీరు కూడ అలవరచుకొంటే, మన మాతృదేశం మళ్ళీ ప్రపంచంలో మొదటి స్థానాన్ని సంపాదించగలదు.
లెనిన్‌కి బిడ్డలు లేరు. మన పూర్వులేమన్నారో తెలుసా? ''ఉదార చరితానాం తు వసుధైవ కుటుంబకం.'' ఉదారచరితులకి విశ్వమంతా వారి కుటుంబమేనని దీనికర్థం. తధాస్తు. మనందరమూ మహాత్ముడైన లెనిన్‌కి బిడ్డలవంటి వాళ్ళమే, మరి. మీ బాలసంఘం అంతాచేరి, ఈ పుస్తకం చదివి, మాకు తెలుపుతారు కదూ?
- మహీధర జగన్మోహనరావు
