-
-
లగ్న చంద్రిక
Lagna Chandrika
Author: M. Viswanatha Raju
Publisher: Sri Sai Vastu Publications
Pages: 143Language: Telugu
ఫలితజ్యోతిష గ్రంథములలో కాశీనాథ కృత 'లగ్నచంద్రిక' అధిక ప్రాచుర్యమును పొందినది. ముహుర్త చింతామణి పీయుషధారా వ్యాఖ్యానములో కాశీనాథుని నామము అనేక పర్యాయములు ఆదర పూర్వకముగా వ్యక్తీకరించబడినది. అందువలన దీనిని ముహుర్త చింతామణి కన్న పూర్వ గ్రంథముగా తలంప వచ్చును.
ఈ గ్రంథములో తొమ్మిది పరిచ్ఛేదములున్నవి. ప్రథమ పరిచ్ఛేదములో జన్మతిథి, వారనక్షత్ర కరణాది విషయములు, ద్వితీయములో గ్రహభావములు, తృతీయములో నవగ్రహముల మహాదశలు, చతుర్థములో రెండేసి గ్రహముల యుతి ఫలితములు, పంచమములో మూడేసి గ్రహముల ఫలితములు, షష్ఠమములో నాల్గేసి, సప్తమములో ఐదేసి, అష్టమములో ఆరేసి గ్రహముల సంయోగము వలన ఫలితములు, నవమ పరిచ్ఛేదములో అపూర్వ యోగముల గూర్చి వివరణ కలదు.
ఇంతటి మహిమ కలిగిన ఈ గ్రంథము ఇంతకు పూర్వము తెలుగులో అనువదింపబడలేదు. జ్యోతిష శాస్త్రాసక్తి కలిగిన పండితులకుపయోగపడునను తలంపుతో ఈ గ్రంథముననువదించుట జరిగినది.
- డా. ముదుండి విశ్వనాథరాజు
