• Kushtu Vyadhi Gandhiji Drukpadham - free
 • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
  • fb
  • Share on Google+
  • Pin it!
 • కుష్టువ్యాధి - గాంధీజీ దృక్పధం (free)

  Kushtu Vyadhi Gandhiji Drukpadham - free

  Pages: 32
  Language: Telugu
  Rating
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  Be the first to vote
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

ప్రాణులకు బాధలు కలిగించేవి వ్యాధులు. వ్యాధులు రాకుండా చేసేవారు, ఉపశమనం కలిగించేవారు, నిర్మూలించేవారు వైద్యులు, వారి బృందాలు. కొన్ని వ్యాధులు శారీరక మానసిక బాధలనే కాక సామాజిక బాధలను కూడా కలిగిస్తాయి. అటువంటి వ్యాధులు కల వ్యక్తులను సమాజం చిన్నచూపు చూస్తుంది. అలా చిన్నచూపుకు గురిచేసే వ్యాధుల్లో కుష్టువ్యాధి ఒకటి. సరైన అవగాహన లేనందువల్ల ప్రజలు ఈ రకం వ్యాధులపట్ల భయాలు కలిగి ఉంటారు.

ప్రపంచంలో వేల సంవత్సరాల నుంచి వ్యాప్తిలో ఉన్నప్పటికీ గత 70 సం||రాల క్రితం దాకా ఈ వ్యాధికి సమర్థవంతమైన చికిత్స లేదు. ఆ నేపధ్యంలో దానినొక శాపకారణంగా భావించి, భయపడి సన్నిహిత బంధుత్వాలను కూడా తెగతెంపులు చేసుకునేవారు.

ప్రపంచ వ్యాప్తంగా మహనీయులు-మందులు లేని, కారణం తెలియని-ఆ రోగ పీడితులకు సేవలు చేసి ఉపశమనాలు కల్గించారు. అటువంటి వారిలో గాంధీజీ ఒకరు. ఆయన కుష్టువ్యాధిని అదుపు చేయడానికి శాస్త్రీయత, మానవతా దృష్టిలో ప్రయత్నాలు చేశారు. ఈ సందర్భంగా బాపూ జరిపిన విశిష్టసేవలను గుర్తు చేస్తూ ఈ చిన్న పుస్తకాన్ని ప్రచురిస్తున్నాము.

- పెద్ది సాంబశివరావు

***

“గాంధీజీ-కుష్టురోగుల సేవలు” - పుస్తక సమీక్ష

పెద్ది సాంబశివరావుగారు రచించిన గాంధీజీ-కుష్టురోగుల సేవలు చాల బాగుంది. యిది చాల సందర్భోచితం కూడాను. యిది మహాత్మాగాంధీజీ 150 వార్షికోత్సవం అయినందున.

రచనలలో ఉత్తమకోవకు చెందినవి, కేవలం రచయిత రచనాకౌశల్య ప్రదర్శనకు మాత్రమే కాకుండా, సమాజంలో పదుగురికి ఉపయుక్తమయే రచనలు. నిరంతర నిస్వార్ధ కర్మజీవైన సాంబశివరావుగారి కలం నుండి భిన్నంగా వేరొకటి రాదనేది దీనిద్వారా నిరూపితమైనది.

తను అనతికాలమువృత్తిపరంగా పనిచేసిన కుష్టువ్యాధి నిరోధ కార్యక్రమంలో గాంధీజీ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను ఉదహరిస్తూ ప్రజోపకరమైన అంతర్లీన సత్యాలను చక్కగా బహిర్గతం చేసి గాంధీజీ హృదయాన్ని ఆవిష్కరించటంలో రచయిత కృతకృత్యులయ్యారు.

ఈ రచనలో బహిర్గతమైన కొన్ని సత్యాలు:
1. భయం అజ్ఞాన జనితమనీను. కుష్టువ్యాధి గురించి 100 సంవత్సరాల క్రితం జనసామాన్యంలోవున్న తెలియనితనం, అపోహలకు, భయానికి కారణమైనది. 100 సంవత్సరాల తదుపరి 1980 దశాబ్దంలో HIV/AIDS కూడా ప్రజలలో యిదే అజ్ఞానభయకారకం అయినది. అవగాహన భయాన్ని తొలగించే ఆయుధమని --,
2. ప్రపంచం మనతోటే మొదలవుతుందని, ప్రత్యక్ష ఆచరణ, ఉద్రేక పూరిత ఉపన్యాసాల కంటే విలువైన వనీను--,
3. ప్రార్ధించే పెదవులకంటే, పరులను సేవించే చేతులుమిన్న అనీను--,
4. మహాత్ములు, తమకు జరిగిన దూషణ, తిరస్కార, అవమానాలను, ప్రతీకారానికి వాడుకొనకుండా, కేవలం ఆత్మపరిశీలనుకు మాత్రమే వాడుకొని, తన ఆధ్యాత్మిక ప్రగతికీ, ఇతరులను అర్ధంచేసుకోవటానికీ, పదుగురికి ఉపకరించటానికే వాడుకుంటారని--, శ్వేతజాతీయుల నల్లవారిపై జాతి వివక్షకు, మనం కుష్టురోగులపై చేసే వివక్షకూ సారూప్యం వుందని చెప్పటంలో యీ ఆత్మపరిశీలన వుంది.
5. “ఎంతమంది యిలా తాను చెప్పినవి చేసి చూపించగలరు? గాంధీజీ మహాత్ముడవటానికిదే నిదర్శనం” అన్నారు సాంబశివరావుగారు. గాంధీజీ తన ఆత్మకధను ‘మై ఎక్స్ పిరిమెంట్స్ విత్ ట్రూత్’ అనడానికిదే కారణం. మహాత్ముల మాటలకంటే వారి జీవితాలనుండి మనం ఎక్కువ నేర్చుకోగలం.
6. “మహాత్ముల జీవితాలే వారి సందేశాలు”.
7. రోగగ్రస్థ మనస్సుకంటే, రోగగ్రస్థదేహమే మేలనీను--,
8. మహాత్ములు బాహ్యప్రియులు కారు, భావప్రియులనీను, దైనందిన కర్మకాండ సంబంధిత అలవాట్ల కంటే ఎదుటివ్యక్తి భావనకు ప్రాధాన్యత నిస్తారనీను--,
9. యితరులలోని మంచిని గ్రహించిన వాడే మహాత్ముడవుతాడనీను--,
10. కేవలం మందూ, మాత్రలే కాకుండా, స్వచ్ఛహృదయంలో జనించే దయ, కరుణల భావనా తరంగాలు, రోగస్వస్థతా తరంగాలై రోగి వుపశమానికి దోహదపడుతాయనీను--,

మహాత్ముని హృదయాన్ని చక్కగా ఆవిష్కరిస్తూ, ఎన్నో విలువలు పొదిగిన మణిభూషణమైన యీచిరుపుస్తకం అందరికీ ఉపయుక్తమయే చక్కని రచన. అందుకు సాంబశివరావుగారిని అభినందిస్తూ, వీరి కలంనుండి, మరిన్ని రచనలు వెలువడాలని కోరుకుంటూ!

- డా. రాఘవేంద్ర ప్రసాద్ సూద్నగుంట
యన్.ఆర్.ఐ థింక్ టాంక్, యు.యస్.ఎ.