• Kurnoolu Zilla Janapada Kathalu
  • fb
  • Share on Google+
  • Pin it!
 • కర్నూలు జిల్లా జానపద కథలు

  Kurnoolu Zilla Janapada Kathalu

  Pages: 328
  Language: Telugu
  Rating
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  Be the first to vote
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

జానపద కథలు మన వారసత్వసంపద, తరతరాలుగా ఇవి మౌఖికంగా ఒకరినుంచి ఒకరికి సంక్రమిస్తూ పిల్లలను, పెద్దలను ఆనందాశ్చర్యాలలో ముంచెత్తుతున్నాయి. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం అయ్యాక, టీవీలు నట్టింట్లో కొలువు తీరాక, ప్రపంచీకరణ పల్లెల్ని కబలించడం మొదలు పెట్టాక, అమ్మమ్మలు తాతయ్యలు చిన్నారులకు దూరం అయ్యాక, పెద్దలు పిల్లలు మార్కుల మాయాజాలంలో ఇరుక్కునిపోయాక, సంపాదించడమే ఏకైక విలువగా అవతరించాక ఈ కమ్మని కథల ఖజానా నెమ్మదిగా తరగిపోసాగింది. వీటిని వెంటనే సేకరించి పుస్తకాలుగా భద్రపరచకపోతే మన సంస్మృతిని మనమే నాశనం చేసుకున్న వాళ్ళం అవుతాం. అందుకే పదహైదు సంవత్సరాలుగా పల్లెల్లో పెద్దల ద్వారా, పుస్తకాలుగా హరికిషన్ ప్రచురిస్తూ వచ్చారు. ప్రస్తుతం అందులోని అమూల్యమైన 121 కథలను కర్నూలు జిల్లా జానపద కథలుగా మన ముందుకు తీసుకొని వస్తున్నారు.

హరికిషన్‌ది పసందైన శైలి. ఆకట్టుకొనే కథనం. కర్నూలు నగర సరళ మాండలికం అద్భుత వాక్య నిర్మాణం. ఈ కథలు చదువుతుంటే మన అమ్మమ్మనో, తాతయ్యనో పక్కన కూర్చుని కథ చెబుతున్నంత మధురంగా వుంటాయి. పిల్లలు మాట్లాడుకునే భాషలో కథలన్నీ ప్రవాహంలా పరుగులు పెడుతుంటాయి. హరికిషన్ కథను విన్నది వినట్లుగా మనకందించడు. కేవలం మూలాంశాన్ని మాత్రమే తీసుకొని దానికి అనేక మార్పులు చేర్పులు చేస్తూ ఇప్పటి తరానికి అనుకూలంగా అందిస్తాడు. ఈ పునఃసృష్టి వల్లనే కథలన్నీ మరింత అద్భుతంగా, సజీవంగా తయారయి అందరినీ ఆకట్టుకొంటాయి. అదే హరికిషన్ రచనా విలక్షణత.

- పబ్లిషర్స్

గమనిక: "కర్నూలు జిల్లా జానపద కథలు" ఈబుక్ సైజు 6.5mb
Preview download free pdf of this Telugu book is available at Kurnoolu Zilla Janapada Kathalu