-
-
కుర్చీ
Kurchi
Author: Deerghasi Vizai Bhaskar
Publisher: Self Published on Kinige
Pages: 73Language: Telugu
ఒక ప్రేక్షకుడిగా రంగస్థలంపై ఈ నాటకాన్ని నేను చూశాను. ఒక పాఠకుడిగా ఈ నాటకాన్ని నేను చదివాను. కొన్ని నాటకాలు రంగస్థలంపై చూడటానికి మాత్రమే అనువుగా ఉంటాయి. చదివితే చప్పగా ఉంటాయి. ఈ నాటకం అలాకాదు. చూస్తున్నప్పుడు ఎలాంటి రసావేశానికి లోనవుతామో చదువుతున్నప్పుడు కూడా అలాంటి అనుభూతినే పొందగలుగుతాము. చూసినప్పుడూ, చదివినప్పుడూ కూడా ఈ నాటక సంవిధానం నన్ను కేవలం ఆకర్షించటమే కాదు ఆలోచింప చేసింది కూడా ! ఇదీ ఈ నాటక నిర్మాణంలో ప్రత్యేక లక్షణం!
వర్తమాన సామాజిక సందర్భం ఈ నాటకానికి నేపథ్యం! ఈ నాటకం పేరు “కుర్చీ”! కుర్చీ రాజ్యాధికారానికి సంకేతం! తరతరాలుగా గ్రామం మొదలుకొని దేశం వరకూ, ఆగ్రవర్ణాల వాళ్లూ, పెత్తందార్లూ రాజ్యాధికారాన్ని చెలాయిస్తూ వున్నారు. ఇటీవల అనివార్యంగా వచ్చిన కొన్ని మార్పుల వల్ల దళితులు కూడా కొన్ని కొన్ని చోట్ల అధికారాన్ని అందుకోగలుగుతున్నారు. వాళ్ళకు ‘కుర్చీ’ సంక్రమించినంత మాత్రాన వాళ్ల స్థాయి పెరిగిందా? వాళ్ల అధికారాన్ని సమాజం అంగీకరించే దశలో ఉందా? వాళ్ల అధికారం నిజంగా వాళ్ల చేతుల్లోకి వచ్చిందా? ఇంతకాలంగా అధికారం చెలాయించిన వర్గాలు వాళ్లను సహించగలుగుతున్నాయా? వాళ్లకు సంక్రమించిన అధికారం కేవలం నామ మాత్రమేనా? వాళ్ల చైతన్య స్థాయి ఏమిటి? ఈ విషయాలను దృశ్యరూపంగా చర్చించిన చక్కని నాటకం ఈ కుర్చీ.
- సింగమనేని నారాయణ
