-
-
కునన్ పోష్పోరా
Kunan Poshpora
Author: Multiple Authors
Publisher: Perspectives
Pages: 241Language: Telugu
ఇది 29 సంవత్సరాలు గడిచినా తెల్లవారని రాత్రి గురించిన కథ. హింస, అన్యాయం, అతి క్రమణ, అణచివేత, అబద్దాలను తలపై మోసిన కథ, అంతులేని ధైర్యం, సాహసం, వాస్తవాలను మోసిన కథ కూడా ఇదే. ఆ రాత్రి జరిగిన ఘోరం కంటే, ఆ తరువాత నుండీ ఇప్పటి వరకూ గడిచిన 29 సంవత్సరాలలో జరిగిన న్యాయ నిరాకరణే భయంకరమైనది, న్యాయాన్ని తిరస్కరించడం, సాక్ష్యాలను అదృశ్యం చేయటం, అంతులేని జాప్యంతో విచారణను నిరవధికంగా పొడిగించటం, బాధను అవమానించటం- ఈ పనులన్నిటినీ భారత ప్రభుత్వం, భారత ఆర్మీ, భారత మీడియా కలిసి చేశాయి.
ఈ దేశంలో మహిళల అస్తిత్వం ఎప్పుడూ సంక్షోభంలోనే ఉంటుంది. అయితే సంక్షోభంలో ఉన్న కశ్మీర్లో మహిళ అస్తిత్వం ఎలా ఉంటుంది? గత మూడు దశాబ్దాలకు పైన యుద్ధంలో ఉన్న కశ్మీర్ ప్రాంతంలో మహిళ అంతరంగం ఏమై ఉంటుంది? అది అనంతమైన దుఃఖాన్ని మోస్తూ ఉంటుంది. సముద్రమంత లోతైన గాయాన్ని కలిగి ఉంటుంది. ఎడతెగని వేదన అనుభవిస్తూ ఉంటుంది. ఆమ్ల ద్రావకపు కడుపుకోతను భరిస్తూ ఉంటుంది. అంతులేని అవమానాన్ని దిగమింగుకొంటుంది. అయినా ఆమె పునరుతానం చెందుతూనే ఉంటుంది. ముందుకు నడిచిపోతూనే ఉంటుంది.
***
ఐదుగురు కశ్మీరీ యువతులు ఎస్సార్ బతూల్, ఇఫ్రా భట్, సమ్రీనా ముష్తాక్, మునాజా రషీద్, నతాషా రాథర్లు రాసిన ఈ పుస్తకం ఒక స్మృతి, ఒక నివాళి. ఒక విస్మృత వ్యతిరేక పోరాటం, జ్ఞాపకాలను దాచిపెట్టుకోవటానికి పునరుద్ధరించుకోవటానికి ఒక దారి.
- రమాసుందరి

- FREE
- FREE
- ₹180
- FREE
- ₹270
- FREE