-
-
కుల నిర్మూలన పోరాటానికి ద్వేషం ప్రాతిపదిక కాదు
Kula Nirmoolana
Publisher: Janaharsha Publishers Pvt. Ltd.
Pages: 76Language: Telugu
ఈ పుస్తకం గురించి..
కంచ ఐలయ్య రాసిన 'వై అయామ్ నాట్ ఎ హిందూ' పుస్తకం అతి తక్కువ కాలంలోనే దేశ, విదేశాల్లో సుప్రసిద్ధమైంది. ప్రసిద్ధ ఆంగ్ల దినపత్రిక 'ది పయనీర్' ఐలయ్య పుస్తకాన్ని, ఈ సహస్రాబ్దపు ఐదు గొప్ప పుస్తకాల్లో ఒకటని కీర్తించింది. హైదరాబాద్ బుక్‌ట్రస్ట్ ఈ పుస్తకాన్ని 'నేను హిందువు నెట్లయిత?' అనే పేరుతో తెలుగులోకి తెచ్చింది.
ఐలయ్య పుస్తకం పైన రాగద్వేషాలకు అతీతంగా, సహేతుకమైన, సమగ్రమైన చర్చ జరగలేదనే అభిప్రాయం వుంది. అటువంటి చర్చ కులనిర్మూలనా వుద్యమాన్ని మరింత పరిపుష్ఠం చేసేందుకు దోహదపడుతుందని మా విశ్వాసం.
ఐలయ్య రచన పైన రెండు విమర్శలు 'విజయవిహారం' పత్రికలోనే వచ్చాయి. ఈ రెండు విమర్శలు అప్పట్లో అనేకమంది దృష్టిని ఆకర్షించాయి.
జి.ఎస్.రామ్మోహన్ రచన ''చరిత్రపేరుతో ఫిక్షన్'' అక్టోబర్ 2000 విజయవిహారం సంచికలో వచ్చింది. కేశవరావ్ జాదవ్ రచన ''కుల నిర్మూలనా పోరాటానికి ద్వేషం ప్రాతిపదిక కాదు'' 2001లో మార్చి నుంచి ఆగస్ట్ వరకూ ధారావాహికగా వచ్చింది.
ఈ రెండు రచనలను పుస్తకరూపంలోకి తీసుకు రావలసిన అవసరం చాలాకాలంగా వుండింది.
ఆలస్యమైన విషయం నిజమే అయినా, ఈ పుస్తకాన్ని తెలుగు పాఠకులకు అందించగలుగుతున్నందుకు మేమెంతో సంతోషిస్తున్నాం.
రామ్మోహన్ రచన మోహన్ కార్టూన్లతో 'విజయవిహారం'లో వచ్చింది. అదనంగా 'విజయవిహారం' జూలై 2001 సంచిక నుంచి మరొక మోహన్ కార్టూన్‌ను (మరో పత్రికలో వచ్చిన ఐలయ్య ఇంటర్వ్యూను విమర్శిస్తూ వేసినది) ఈ పుస్తకంలో కలుపుతున్నాము.
కులనిర్మూలనకు, సాంఘిక పరివర్తనకు సాగే పరిణామక్రమానికి ఈ పుస్తకం గణనీయమైన దోహదం చేస్తుందనే విషయంలో, కుల వ్యతిరేక ఉద్యమ కార్యకర్తలకు తిరుగులేని స్ఫూర్తినీ, ఉత్సాహాన్నీ అందిస్తుందనే విషయంలో మాకు ఎటువంటి సందేహమూ లేదు.
- జనహర్ష పబ్లిషర్స్

- ₹75.6
- ₹60
- ₹60
- ₹60
- ₹60