• Kujudi Kosam
  • fb
  • Share on Google+
  • Pin it!
 • కుజుడి కోసం

  Kujudi Kosam

  Author:

  Pages: 228
  Language: Telugu
  Rating
  2.50 Star Rating: Recommended
  2.50 Star Rating: Recommended
  2.50 Star Rating: Recommended
  2.50 Star Rating: Recommended
  2.50 Star Rating: Recommended
  '2.50/5' From 2 votes.
  2.50 Star Rating: Recommended
  2.50 Star Rating: Recommended
  2.50 Star Rating: Recommended
  2.50 Star Rating: Recommended
  2.50 Star Rating: Recommended
  '2.50/5' From 2 premium votes.
Description

నాలుగో సహస్రాబ్ది 3260.

అణుయుద్ధాలూ, ప్రకృతి వైపరీత్యాల వల్ల భూమి ఎక్కువ మేర నశించిపోయి మానవులు చాలావరకు ఇతర గ్రహాలకి వలస పోయి అంతర్‌గ్రహ నాగరకత విలసిల్లుతున్న కాలం.

అంతర్‌గ్రహ యానాలు, సమాచార వ్యవస్థా, వైద్య రంగాల్లో మానవులు ఎంతో ప్రగతిని సాధించారు. ఇప్పటి సెల్ ఫోన్స్‌లాగా, రోబోట్స్ లాగా, ఇంటర్‌నెట్‌ లాగా ఇంటర్‌గలాక్జిక్ నెట్ కాంతివేగంతో ప్రయాణించే అంతరిక్ష నౌకలూ వృద్ధి చెందినా మనిషి భావాలు, ఆలోచనలూ, వ్యక్తిత్వమూ ఎప్పటిలాగానే వున్నాయి. వెనకబడిన భూమి నుంచి మానవులు గ్రహాలకి వలసపోయే ప్రజలూ, స్పేస్ ప్లాట్‌ఫారంలూ, వివిధ జాతుల మానవులూ, మానవులని బోలిన హ్యుమనాయిడ్స్.... అది ఒక సరికొత్త విశ్వం!

మధ్య ఆసియాలోని ఇండికా సెంట్రల్ యూనివర్సిటీలో బయోమెడికల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న హనీ అనే యువకుడికి బాల్యం నుంచి సయోనీ అనే అందమైన కుజ యువతి కలలోకి వస్తుంటుంది. ఆమెని చూడాలనే కోరికతో కుజగ్రహం చేరుకున్న అతని జీవితంలో విచిత్రమైన మార్పులు చోటు చేసుకుంటాయి. కుజునిలో నివసిస్తున్న మానవ కాలనీకీ, అదే గ్రహంలో అరుణ భూముల రాజ్యంలో ఉన్న మాంత్రికులకీ కుజగ్రహ ఆధిపత్యం కోసం జరుగుతున్న యుద్ధంలో చిక్కుకుంటాడు హనీ. ప్రేమ కోసం బయలుదేరిన హనీ తన గురించి కొత్త విషయాలు తెలుసుకోడం, అద్భుత శక్తులు సంపాదించడం, కొత్త లక్ష్యంతో భూమికి తిరిగి రావడం....

ఆ క్రమంలో జరిగి చిత్ర విచిత్రాలను మనోహరంగా వర్ణించిన కథ ఇది!

భవిష్యత్ నాలుగో సహస్రాబ్దిలో జరిగినట్లుగా ఊహించి కల్పనకి సైన్సు మిళితం చేసి కొత్త ప్రయోగంగా డా. చిత్తర్వు మధు రాసిన స్పేస్ ఒపేరా ఇది!

భవిష్యత్ ఫాంటసీతో మిమ్మల్ని తప్పక అలరిస్తుంది.

* * *

వార్ ఫర్ మార్స్ అని ఇంగ్లీషులో తానే రాసిన నవలకు రచయిత స్వీయానువాదం. రచన మాస పత్రికలో ధారావాహికగా ప్రచురించబడింది. దీనికి ఇంకా సీక్వేల్స్ రాయాలనే తపనకి ఇది పునాది.

Preview download free pdf of this Telugu book is available at Kujudi Kosam
Comment(s) ...

This is neither since fiction nor comic nor fantasy

Good novel, but its a cocktail of 'janapadam' 'star wars'. Sometimes I felt like balance is missing. Overall good one. Tks.

ఆసక్తికర నవల
భావన, ఊహ, సృజనాత్మక శక్తులు దాదాపు అంతరించిపోయి ఒక గాడిలో పడి యాంత్రికంగా చరిస్తున్న తెలుగు నవలా సాహిత్యంలో ఎన్.ఆర్. నంది తరువాత సైన్స్ ఫిక్షన్ విభాగంలో కొంతలో కొంత ఆ లోటును తీరుస్తూ వెలువడిన సైన్స్ ఫిక్షన్ నవల డాక్టర్ చిత్తర్వు మధు రాసిన 'కుజుడి కోసం'.

క్రీస్తు శకం 3264 సంవత్సరం లో భూమిపైన రెండుసార్లు అణుయుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు జరిగిన తర్వాత, భూమి నుంచి అన్ని దేశాల ప్రజలు ఇతర గ్రహాల్లోకి వలసపోయి నివసించే రోజుల్లో, భూమి మీదే నివసించే ఒక బయో మెడికల్ ఇంజనీర్ తన కలలో కనిపించిన ఒక కుజగ్రహ సుందరి ప్రేమను పొందాలనే ధ్యేయంతో కుజగ్రహానికి చేసిన ప్రయాణంలో జరిగిన సంఘటనలే ఈ నవలకు మూలాధారం. ఆ తర్వాత కుజగ్రహంలోని మాంత్రికులకూ, మానవులకూ జరిగిన యుద్ధంలో అతను చిక్కుకోవడం దగ్గర్నుంచి తిరిగి అతను భూమిని చేరేవరకూ జరిగిన ఘటనలను ఆసక్తికరంగా నవలీకరించాడు రచయిత. అరవై రెండు అధ్యాయాలు ఈ నవలలో గతాన్నీ, భవిష్యత్తునూ మిళితం చేసి అద్భుతమైన ఫాంటసీని సాధించాడు. ఈ క్రమంలో రోబోలు, ఇంటర్ గెలాక్టిక్ నెట్ వంటి ఎన్నో సాంకేతిక అంశాలను సాధారణ పాఠకులకు అర్థం అయ్యేట్టు రాయడం ఈ నవల ప్రత్యేకత.

పునరుక్తులను కొంచెం ఎడిట్ చేసుకుని ఉంటే నవలలో మరింత 'బిగి' ఉండేది. అలాగే నవలలోని శాస్త్రీయతను మరికొంచెం సరళీకరించినా నవలా క్రమం ఒక గతిలో సాగిపోయేది. మొత్తం మీద చాలాకాలం తర్వాత వెలువడ్డ ఈ సైన్స్ ఫిక్షన్ నవల ఆ అభిరుచి గల పాఠకుల్ని విడవకుండా చదివిస్తుంది. అలాగే కుజగ్రహం గురించి శాస్త్రీయ వివరాలు తెలుసుకోవాలన్నవారు కూడా ఈ పుస్తకాన్ని చదవొచ్చు.
కుజుడి కోసం, డాక్టర్ చిత్తర్వు మధు Reviewed by Andhrajyothy aadivaram 25-11 2013