-
-
కృష్ణాతీరం
Krishnateeram
Author: Malladi Ramakrishna Sastry
Publisher: Creative Links Publications
Pages: 184Language: Telugu
తెలుగుతనాన్ని అక్షరాలనిండా నింపి కథలు, నవలలు, పాటల రూపంలో మనకందించిన మహోన్నత సాహితీమూర్తి శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు.
ఆధునిక నవలా సాహిత్యంలో అనర్ఘరత్నంగా కీర్తించబడే మల్లాది వారి రచన ఈ 'కృష్ణాతీరం' నవల.
*****
మనం కృష్ణాతీరం వాళ్ళం!
పేరు గొప్పేకాదు: ఎక్కడికి వెళ్లినా పెద్దపీట వేయించుకుంటాం!''
''ఓయబ్బ! - ఏటి ఒడ్డున పుట్టిన వాళ్లెవరైనా యింతే!''
''అటు పెన్నలో వాళ్లూ, యిటు గోదావరిలో వాళ్లూ, - ఏడేడు తరాలనుంచీ యిదే రాంభజన''
''వాళ్ళు చేశారంటే సబబుంది! అక్కడ నన్నయ్య, యిక్కడ తిక్కన్న పుట్టుకొచ్చారు...''
''ఆ, - భారతమూ పుట్టుకొచ్చింది! మూడూళ్లు తిరిగితేకాని ముడిపడలేదు. కృష్ణఒడ్డున కూచుని సంకల్పం జెప్పుకుని, ఒంటిచేతి మీద భాగవతం వ్రాశాడు, ఆ పేద బ్రాహ్మడు! అన్నీ నదులే, కాని, యిదిరా
నాయనా తేడా!
*****
ఇహ బ్రాహ్మణీకం అంటావా!
చిత్తశుద్ధి - సదాచారం, వినయం, వివేకం - యివి బ్రాహ్మణ లక్షణాలు. అంతే కాని, ఫలానా యింట్లో పుట్టడం కాదు. యిప్పటి మన సంకుచిత దృష్టితోనే చూస్తే - మన లెక్క ప్రకారం, మంత్రద్రష్టలైన ఋషుల్లో, యెంతమంది బ్రాహ్మణులున్నారు. ఒక్కడో అరో మినహాయిస్తే – తతిమ్మా వారందరూ, అనులోమ ప్రతిలోమముల ఫలితాలే కద!-
- ₹108
- ₹129.6
- ₹270
- ₹216
- ₹108
- ₹108
A very good book to know the timeline, people life style in 19th and early 20th century. The language used is so sweet and poetic. Please add other books Malladi Ramakrishna Sastry.