-
-
కృష్ణార్పణం
Krishnarpanam
Author: K. Ramalakshmi
Publisher: Stree Shakti Prachuranalu
Pages: 167Language: Telugu
''అన్నయ్యా, సుదాముడు అధికసంతతితో బాధపడుతున్నాడు. కాని పిల్లలని ఎంత హాయిగా పెంచుతున్నాడో చూడలేదు. ప్రకృతి ప్రసాదించే సంపద తనకి చాలని తృప్తిపడుతున్నాడు. కాని మన మిత్రుడే, అగ్నిద్యోతనుడు చూడు. ఆడంబరంగా - రాజభోగంగా రాజలాంఛనాలతో జీవిస్తున్నాడు. ఇద్దరూ మనకి తెలిసిన వాళ్లే కానీ, ఇద్దరి దృక్పథంలోనూ ఎంతటి వ్యత్యాసం!'' నవ్వాడు కృష్ణుడు.
''అవును తమ్ముడూ, ఆ ప్రాంతాల వారతన్ని కుచేలుడని పిలుస్తున్నారంటే బాధగా వుంది. పురాణశ్రవణానికి వచ్చిన వారేదైనా విలువైన వస్తువులు పెడితే సుతారంగా తిరస్కరించి పంపేస్తాడని విన్నాను''.
''అవునన్నయ్యా, అది చూస్తేనే అతనెంతటి ఐశర్యవంతుడో తెలియడం లేదా? సుఖాన్నిచ్చేది సంతృప్తిగానీ, ధనం కాదని తెలుసుకున్నవాడు సుదాముడు. కుచేలుడన్నంత మాత్రాన అతనికి తరిగేదేముంది?'' సమర్థించాడు కృష్ణుడు.
''ఏమోనయ్యా, సుదాముని కీర్తి కుచేలుడుగా విస్తారమవుతోంది. అతని భాగవతపఠనం వినడానికి వందలాదిమంది వచ్చినా, అతనికేం ఒరిగేది లేదనే నా బాధ! మనం ఏం చెయ్యలేమా?''
''కాలం కలిసి రావాలి కద. మనం అతని జీవనవాహినిని నిర్దేశించకూడదు'' గంభీరంగా అన్నాడు కృష్ణుడు.
''కాలం కలిసి వస్తే నువ్వు పెళ్లి మీద పెళ్ళి చేసుకుంటావని తేలిపోయింది కద తమ్ముడూ? అదే సుదాముడూ జనానికి చెప్తున్నట్టుంది. తన్మయత్వంతో పల్లె జనులు నీ కల్యాణాలు వింటూ ఆత్మనేత్రాలతో చూస్తున్నారయ్యా!''
