• Krishnapaksham
  • Ebook Hide Help
    ₹ 324
    360
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కృష్ణపక్షం

    Krishnapaksham

    Pages: 199
    Language: Telugu
    Rating
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

రాజగిరి గుట్టపైన ఉన్న పురాతన శివాయలంలో దారుణ హత్యల గురించి మీడియా ప్రతి అరగంటకు ఒక బ్రేకింగ్ న్యూస్ చొప్పున అందిస్తూ ప్రజలలో ఉత్కంఠను పెంపొందిస్తూ ఉంది. అవి హత్యలే అనేది నిస్సందేహంగా పోలీసులకి తెలిసినా వాటికి వేదిక గుట్ట మీది శివాలయమా, లేక మరెక్కడైనానా అనేది ఇంకా తేలకపోవడంతో మీడియా ఊహాగానాలకు పట్టపగ్గాలు లేకపోయింది.
"గుట్టమీద శివాలయంలో నిధులు గురించి తవ్వకాలు" అని ఒక ఛానెల్ అంటే, "నిధుల వేటలో నరబలులు" అంటూ మరో ఛానెల్ నాలుగడుగులు ముందుకు వేసింది.
"వింత హత్యలు, విచిత్ర ఆలయం" అంటూ ఒక ఛానెల్ కథనాలను భారీగా విరజిమ్ముతుంటే
“ఆస్తుల తగాదాలలో అన్నదమ్ముల హత్య" అంటూ మరో ఛానెల్ ఊహాగానాలు చేసింది.
అక్కడితో ఆగకుండా "ఈ విషయంలో పోలీసుల పరిశోధన ఎంతవరకు వచ్చిందో చెప్పు విశ్వా" అంటూ సూడియో నుంచి ఒక తేజా అడుగుతుంటే, "పోలీసులు ఈ విషయంలో ఏమీ పట్టనట్లున్నారనిపిస్తోంది, నువ్వేమంటావు లతా?" అంటూ మరో సూర్యా సూడియో నుంచి రెచ్చగొట్టే ధోరణిలో నోరు పారేసుకుంటున్నాడు మైకులముందు.
తన ఛాంబర్‌లో ఉన్న టివి ఛానెళ్ళు మార్చి మార్చి చూస్తూ చివరకు ఒక ఛానెల్ దగ్గర ఆగి నిటూరుస్తూ టివి రిమోట్ టేబుల్‌పై పెట్టాడు నాయర్.
ఎస్‌పి నాయర్‌కి ఆ రోజు చాలా దుర్దినం అనిపించింది. అదే మాటను బయటకు చెప్పలేక సతమతమవుతున్నాడు. ఎందుకంటే ఆ రోజు అతని పెళ్ళిరోజు!

Preview download free pdf of this Telugu book is available at Krishnapaksham
Comment(s) ...

Please enable rent option for this book

Pls enable rent option for this book