-
-
కృష్ణం వందే జగద్గురుమ్
Krishnam Vande Jagadgurum
Author: Polisetty Brothers
Publisher: Sri Vivekananda Publications
Pages: 117Language: Telugu
శ్రీ మహావిష్ణువు “కృష్ణవతారం” దాల్చి, 5 వేల సంవత్సరాల పైగా కాలం గడిచింది. అయితే ఆ అవతారాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నవారు మాత్రం చాలా అరుదు. చెరుగని చిరునవ్వుతో ధర్మసంస్థాపన కోసం కృషి చేసిన శ్రీ కృష్ణ పరమాత్మ, ఆనాడూ ఈనాడూ కూడా అజ్ఞానుల వక్రదృష్టి వల్ల ఎన్నో నిందలకు గురికావడం జరుగుతూనే ఉంది.
అమ్మాయిల వెంట తిరిగే జులాయిగాళ్ళనూ మరియు కిలాడీగాళ్ళనూ, దొంగలనూ ‘శ్రీకృష్ణునితో’ పోల్చడం నేటి సమాజంలో ఫ్యాషనైపోయింది. కథల్లో, నవలల్లో, ముఖ్యంగా మన తెలుగు సినిమాల్లో శ్రీ కృష్ణునిపై మూర్ఖమైన చెణుకులు విసురుతూ – అది ఓ గొప్పగా భావించుకుంటున్నారు.
అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతున్న అలాంటి అభాగ్యులను వెలుగుబాట వైపు నడిపించేందుకు కాంతి కిరణంలా దూసుకువచ్చింది – కృష్ణం వందే జగద్గురుమ్.
అవతారం ఎత్తిన క్షణం నుండీ అవతార సమాప్తి వరకూ శ్రీ కృష్ణుని ప్రతి చేష్టలోనూ ఒక గుణపాఠం కన్పిస్తున్నదనీ, ఆయన్ని వేలెత్తి చూపగల శక్తి ఎవరికీ లేదనీ ఈ పుస్తకం ద్వారా ఎలుగెత్తి చాటుతున్నారు రచయితలు.
