-
-
కృష్ణం కలయ...
Krishnam Kalaya
Publisher: Jaggamamba Prachuranalu
Pages: 106Language: Telugu
బహువర్ణనలు కాక కథాకథన ప్రాధాన్యంతో కొనసాగిన కావ్యమిది. "కృష్ణం కలయ..." అంటే కృష్ణుని చూడుము అని అర్థం. ఆ చూడడం కలయ చూడడం. చక్కగా దర్శించడం. కృష్ణదర్శనమంటే కృష్ణతత్త్వ దర్శనం. ఆ తత్త్వదర్శనానికి అనువైన భావనలు, నుతులు, వర్ణనలు, కథాసంబంధితాలు ఈ కావ్యంలో సముచిత స్థానాల్లో ఉన్నాయి. కృష్ణతత్త్వం లీలా మానుషం. ధర్మస్థాపనకు అవనికి దిగిన అవతారం. నమ్మినవారికి నమ్మినంత, కొలిచినవారికి కొలిచినంత భక్తి, రక్తి, ముక్తి - అని రసమనస్వులకు మనవి.
- వసునందన్
ఈ "కృష్ణం కలయ..." చదివాక ఒకవైపు ఆశ్చర్యం, మరొకవైపు ఆనందం. 391 పద్యాల కావ్యమిది. కృష్ణుడి పుట్టుకతో ప్రారంభమై గీతోపదేశం వరకు సాగింది. అంటే రసవద్ఘట్టాల సాందీకృతి ఈ పద్యకృతి. ఈ పద్యాలు చదువుతూంటే పోతన స్ఫురించినట్లే ఆయా సందర్భాల్లో తిక్కన - తిరుపతి వేంకటకవులు తళుకు లీనుతూ వసునందన్గారి సాహిత్యాభిజాత్యానికి సాక్షులై కనువిందు చేస్తారు.
- ఆచార్య బేతవోలు రామబ్రహ్మం
* * *
లోకపావన రక్షణైక దీక్ష విపక్ష
చక్ర శిక్షాదక్ష చక్రియొకటి
లోకపావన ప్రణవైక ప్రణాద ప్ర
శస్త నిర్మలకీర్తి శంఖియొకటి
లోకపావన దుర్మదైకమోకడ ప్రభం
జనమూర్తి మద్గదా సహితమొకటి
లోకపావన శుభదైక వరప్రదా
భయ భద్రముద్రా ప్రభావమొకటి
కరము కళ్యాణ కరచతుష్కము చెలంగ
మహిత శ్రీవత్సకౌస్తుభ మణులు వెలుగ
కన్నవారల తాపదుఃఖములు తొలగ
నిలిచె మాటాడె మాధుర్య నిధులు గలుగ

- FREE
- ₹129.6
- ₹108
- ₹108
- ₹64.8
- ₹81
- FREE
- ₹129.6
- ₹108
- ₹108
- ₹64.8
- ₹81