-
-
కృష్ణతత్త్వము
KrishnaTatvamu
Author: Chavali Anjaneya Murthy
Publisher: Chavali Anjaneya Murthy
Pages: 113Language: Telugu
లోగడ శ్రీ మూర్తిగారు 'శ్రీ రామతత్త్వము' అనే చక్కని పుస్తకాన్ని ఆంధ్ర పాఠకులకు అందించారు. అవతార క్రమంలో రామావతారం తరువాతది కృష్ణావతారం. ఆ వరుసలో ఇప్పుడు ఈ కృష్ణతత్త్వాన్ని రచించారు మూర్తిగారు. శ్రీకృష్ణావతారం దశావతారాల వరుసలో ఎనిమిదోది. శ్రీకృష్ణునికి ఈ ఎనిమిది సంఖ్యకు విశేషమైన సంబంధం ఉంది. అతడు దేవకీదేవికి అష్టమగర్భంలో జన్మించాడు. అతని జన్మతిథి అష్టమి. అతనికి భార్యలు ఎనిమిది మంది. అష్టమహిషులుగా ప్రసిద్ధులు. ఈ ఎనిమిదిమంది అష్టవిధ శృంగారనాయికలకు ప్రతీకలు. శ్రీకృష్ణుడు గీతలో పేర్కొన్న ప్రకృతులు ఎనిమిది. ఇలా అష్ట సంఖ్యకు, శ్రీకృష్ణునికి గల సంబంధాన్ని సంభావించి ఆంజనేయమూర్తిగారు ఈ పుస్తకంలో ఎనిమిది వ్యాసాలు కూర్చి ఔచిత్యాన్ని సమాదరించారు. కృష్ణజననమాది కృష్ణనిర్యాణ పర్యంతం గల వివిధ ఘట్టాలను అష్టధా విభజించి రచన చేశారు.
"విబుధ జనులవలన విన్నంత కన్నంత" - తమ రచనలో నిక్షిప్తం చేసి కృష్ణతత్త్వాన్ని ఆవిష్కరించారు ఆంజనేయమూర్తిగారు.
- మలయవాసిని
