-
-
కృష్ణమోహన్ కథాసవ్రంతి భాగం - 2
Krishna Mohan Katha Sravanthi Part 2
Pages: 319Language: Telugu
డా. దవులూరి శ్రీ కృష్ణమోహన రావు గారి "కోనసీమ కథలు", "తూర్పుగోదావరి కథలు", "బ్రహ్మదేవుడూ మగాడే" అనే కథా సంపుటాల నుంచి ఎంచి కూర్చిన కథలు ఇవి.
* * *
ఒక ప్రాంతాన్ని నేపథ్యంగా స్వీకరించి మూడు సంవత్సరాలలో 123కి పైగా కథలు రాసి, సాహితీ లోకాన్ని అలరించిన కృష్ణమోహనరావు గారి కృషి నిజంగా అభినందనీయం. వృత్తికి ప్రవృత్తికి సమానంగా న్యాయం చేకూర్చిన సవ్యసాచి డాక్టర్ కృష్ణమోహనరావు గారు. నేపథ్యం ఒకటే అయినా ప్రతి కథ ప్రత్యేకతను సంతరించుకొని రచయితకు గల రచనా నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తుంది. అయితే కృష్ణమోహన్ గారి కథలన్ని దాదాపుగా వారి జీవితానుభవాలే. ఆయా కథలలోని పాత్రలు తూగోజిలోనే కాదు, అన్నీ ప్రాంతాలలోను, అందరికి కనిపించే సమాజంలోని వ్యక్తులే.
కృష్ణమోహన్ గారి శైలి సరళ సుందరం, సహజ బంధురమైనది. తమ చుట్టూ ఉన్న వారిని పాత్రలుగా చేసి, తమకెదురైన సంఘటనలను ఇతివృత్తాలుగా తీర్చిదిద్దిన రచయిత సామాన్య జనానీకం మాట్లాడుకొనే సరళమైన భాషను, ఇంకా చెప్పాలంటే గ్రామ్యాన్ని ఉపయోగించారు. కలకత్తాలో వైద్య విద్యను అభ్యసించిన కృష్ణమోహనరావు గారిని తూర్పుగోదావరి మాండలికం మాత్రం వదలలేదు. దాదాపు అన్ని కథలలోనూ ఈ మాండలికం, యాస మనకు కనిపిస్తాయి. ఈ విధమైన వినూత్న శైలి వీరి కథలకు సహజత్వాన్ని చేకూర్చిపెట్టింది.
నిగర్వి, సంతుష్ట జీవనుడు అయిన కృష్ణమోహనరావుగారు నాకెంతో ఆత్మీయులు. వీరు కొన్ని కథలను ఆసక్తికరంగా, మరికొన్ని కథలను ఆలోచనాత్మకంగా ముగించటం నాకెంతో నచ్చింది. సంఘంలోని రుగ్మతలను హాస్యంతో మేళవించి, ఎత్తి చూపటం వీరి ప్రత్యేకత.
- ఆచార్య నన్నవ సత్యనారాయుణ,
ప్రొఫెసర్, నాగార్జున యూనివర్శిటి
I have read part one of the author and I liked them very much.