-
-
కృష్ణమోహన్ కథాసవ్రంతి భాగం - 1
Krishna Mohan Katha Sravanthi Part 1
Pages: 308Language: Telugu
డా. దవులూరి శ్రీ కృష్ణమోహన రావు గారి "ద్రాక్షారం కథలు", "తూగోజి కథలు" అనే రెండు కథా సంపుటాల నుంచి ఎంచి కూర్చిన కథలు ఇవి.
ద్రాక్షపాకం
చిన్నప్పుడు సత్యం శంకరమంచి అమరావతి కథలు చదివాను. అలా మనసులో నిల్చిపోయాయి.... సాధారణంగ నేను కథలకన్న కవిత్వమే ఎక్కువ చదువుతా... ఎక్కువ ఇష్టంగద.... ఆమధ్య వంశీగారి పసలపూడి కథలూ.... ఇదిగో ఇప్పుడు ద్రాక్షారం కథలు.... నాకు శివుడంటే ఇష్టం.. ఆ కారణంగా పంచారామాల్లోనూ అభిషేకం చేయించుకున్నా... అందులో దాక్షారామం ఒకటి... దాక్షారామ భీమేశ్వరుడి మీద శ్రీనాథుడి పద్యాలు కూడ ఇష్టం...
.... చాలా బద్దకిస్తూ.. మెల్లిగా చదివాను ద్రాక్షారం కథలు... చదివాను అనటం కన్నా ఆ కథల్ని చూసాను అనడం సబబు... ప్రతి కథలోనూ నేటివిటీ... మనమే స్వయంగా కథల్లోకి వెళ్ళిపోయి సంచరిస్తున్న అనుభూతి.... ఎంత అబ్జర్వేషన్.. ఎంతో పరిచయం ఉండి - పరిసరాల్తోటీ.... మనుష్యులతోటీ మమేకం అయితే తప్ప ఇలాంటి కథలు పుట్టవ్...!
అన్నికథల్లోకీ మకుటాయమానమైన కథ 'లేడిగాడు'. అదొక జీవన చిత్రం... ఆర్ట్ఫిలిం... ఒక వ్యక్తి జీవితం.... పుట్టడం దగ్గర్నించీ... వెళ్లిపోయేదాకా...! ఎన్ని మలుపులు... ఎన్ని మెలికలు.. ఎంత కేన్వాసని... కథ మొదలైన కాసేపటికి మనం లేడిగాడితో బైలుదేరీ!... తూర్పుగోదారీ.. దాక్షారం ఏరియాలూ కలియ తిరిగేస్తాం. ఆశ్చర్యపోతాం.... ఆనందపడతాం...కన్ను చెమరుస్తుంది...! గుండె తడౌతుంది!! లేడిగాడు... చాలాకాలం... మన మనసుల్లో ఉండిపోతాడు.... అలాంటి మనిషిని మనం చూసే ఉంటాం... కనీసం చూడలనుకుంటాం...
డాక్టర్‌గా ఎన్నివేలమందికో వైద్యం చేసి ఉంటారు... ఇలాంటి కథలతో... ఎంతో మంది సాహితీప్రియులకి సాహితీ నైవేద్యం చేస్తున్నారు...
ఎంతో ప్రతిభ ఉంటే తప్ప ఇలాంటి కథలు రాయలేరు!!
తెలుగు సాహిత్యంలో 'ద్రాక్షారం కథలకి' ప్రత్యేకమైన గుర్తింపు వొస్తుంది!!
- భవదీయుడు
తనికెళ్ళ భరణి
