-
-
కృష్ణ సినీ జీవిత చరిత్ర
Krishna Cine Jeevita Charitra
Author: T Naveen
Publisher: Todupunoori Friends Association
Pages: 73Language: Telugu
సాహసాలకు పెట్టింది పేరు. తను అనుకున్నది సాధించేవరకు వదిలిపెట్టని ధీరుడు. ఆయనకు నటశేఖరుడు, ఆంధ్ర జేమ్స్‌బాండ్, సూపర్‌స్టార్, డాక్టరేట్ వచ్చినా ఆయన హీరో కృష్ణగానే ప్రసిద్దుడు. సినిమా ప్రపంచంలో ఎవరినైనా ఫలానా అని ఇంటిపేరుతోగాని, అసలు పేరుతోగాని పిలుస్తారు. ఆయనకు మాత్రం హీరో అనేది ఇంటిపేరయ్యింది. ఆయనే ఘట్టమనేని శివరామకృష్ణ. ఆయన జీవితచరిత్రకు ఇదో అక్షరరూపం. ప్రతీ మనిషి జీవితంలోను మిట్టపల్లాలుంటాయి, సుఖదుఃఖాలుంటాయి. ఆయన జీవితంలోనూ వున్నాయి. అవి సాహసంగా ఎదుర్కొని దానినే తనకు మారుపేరుగా మార్చుకున్నారు. కృష్ణకు మారుపేరు సాహసం అని అనిపించుకుని శిఖరాలని అధిరోహించారు. సూపర్‌స్టార్‌గా, నిర్మాతగా, దర్శకుడుగా, ఎడిటర్‌గా, స్టూడియో అధినేతగా, రాజకీయవేత్తగా జీవితంలో ఎన్నో పాత్రలను పోషించడమేకాకుండా, సినిమాస్కోప్ లాంటి ఎన్నో కొత్త సాంకేతికతలను తెలుగు సినిమాకు పరిచయం చేశారు.ఎన్నో భాషల్లో సినిమాలు నిర్మించారు, తెలుగు, హిందీ భాషల్లో దర్శకత్వం వహించారు. 360 సినిమాలలో నటించారు(హీరోగా 340సినిమాలు). ఒక నటుడిగా తన పని తాను చేసుకుని వెళ్ళిపోకుండా సినిమా మొదలు నుండి తుది వరకు నిర్మాతకు అండగావుండే ధర్మశీలి. అటువంటి మహామనిషి జీవితచరిత్ర ఇది.
- ప్రచురణకర్తలు
