• Kovela Rangacharya Samskruta Rachanalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కోవెల రంగాచార్య సంస్కృత రచనలు

    Kovela Rangacharya Samskruta Rachanalu

    Pages: 71
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మన సాంస్కృతిక మూల్యాలు మరుగుపడుతున్న ఈ నాళ్ళలో జీవనంలోకి చొరబడ్డ సంక్లిష్టత, అశాంతి, అల్లకల్లోలములను తొలగించి వీటన్నింటి స్థానంలో ఆధ్యాత్మిక భౌతిక జీవితాల నడుమ సేతువు నిర్మించిన మన వారసత్వాన్ని పదిలపరుచుకోవలసిన అవసరం ఎంతో ఉన్నది. ఈ లోకాన్ని ఈశ్వరుని లోలా విభూతిగా భావించిన శ్రీవైష్ణవ సంప్రదాయం ఈ సమన్వయాన్ని చక్కగా సాధించింది.

ఈ తత్త్వసారాన్ని తన జీవనంలో, ప్రవచనాలలో, ఆచరణలో నెలకొల్పి తమ ప్రభావ పరిధిలో ఎంతో మంది జిజ్ఞాసువులను, అంతేవాసులను ప్రభావితం చేసిన ఉజ్జ్వల జీవనం శ్రీ ఉ.వే.ప్ర. శ్రీమాన్ కోవెల రంగాచార్యులవారిది.

శ్రీమాన్ కోవెల రంగాచార్యులవారి జీవిత తాత్పర్యాన్ని, భావలోక పరిణాహాన్ని నిలబెట్టడానికి శ్రీరామానుజ-వైష్ణవ దర్శనంలోని సామరస్య ప్రాకట్యాన్ని వెలుగులోనికి తేవటానికి వారి సంతానం, వారి శిష్యులు, అభిమానులు అందరమూ కలసి కోవెల రంగాచార్య మెమోరియల్ ట్రస్ట్‌గా ఏర్పడి సాధ్యమైనంతలో ఈ తరానికి ఆ విలువలను అందించే ప్రయత్నం ప్రారంభించాము.

తొలుదులుతగా, ఎంతో కాలంగా అముద్రితంగా పడివున్న వారి సంస్కృత రచనలను, వారి జీవన చరిత్ర సంగ్రహముతో ఇతర విశిష్టమైన చిత్రాలతో, లేఖలతో సమకూర్చి సమర్పిస్తున్నాము.

- కోవెల రంగాచార్య మెమోరియల్ ట్రస్ట్‌

Preview download free pdf of this Telugu book is available at Kovela Rangacharya Samskruta Rachanalu