-
-
కొత్త వంతెన
Kotta Vantena
Author: K. Srinivas
Publisher: Aneka Publications
Pages: 188Language: Telugu
తెలంగాణ ఉద్యమం లో ఆయా వర్గాల భాగస్వామ్యం నిలబడాలంటే ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న పార్టీలు, సంస్థలు, వ్యక్తులు ఆయా వర్గాల సమస్యల వ్యక్తీకరణకు తోడ్పడాలి. తెలంగాణలోని అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని రావటానికి పార్టీలు, నాయకులే కాదు సామాజిక స్థాయి లో కూడా ఆయా వర్గాల మధ్య ఐక్యతను సాధించాలి. ఆ బాధ్యత ఇక్కడి శిష్ట వర్గాల మీద కూడా ఉన్నదని కె. శ్రీనివాస్ సూచిస్తున్నారు. తెలంగాణ ఉద్యమం తెలుగుజాతి పేరుతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల లో స్థిరపడిన కోస్తా సంపన్న వర్గాల ఆధిపత్యానికి సవాలు. ఆ ఆధిపత్యాన్ని ఎదిరించే క్రమం లో తెలంగాణ ఉద్యమం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం అనురించిన అభివృద్ధి పంథాను కూడా తిరస్కరిస్తున్నది. తన అస్థిత్వాన్ని తను నిర్వచించుకొనే క్రమం లోనే తెలంగాణ తన అవసరాలకు, పరిస్థితులకు తగినట్టి ప్రత్యామ్నాయ నమూనాను రూపొందించుకుంటున్నది. ప్రత్యామ్నాయ నమూనా విషయంలో కె. శ్రీనివాస్ వ్యాసాల్లో ఆసక్తికరమైన ప్రతిపాదనలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమం లో పాల్గొనాలన్న ఆసక్తి కల వారికి మాత్రమే కాదు ప్రజాస్వామిక విలువలను వ్యవస్థితం చేయడానికి కృషి చేస్తున్న ప్రజాస్వామిక వాదులందరికి శ్రీనివాస్ వ్యాసాలు ఎంతగానో తోడ్పడుతాయి. ఇంత వరకు పవిత్రంగా భావించిన విలువలు, వ్యవస్థలస్థానే ప్రత్యామ్నాయాలను వెతుక్కొంటున్న నేటి తరుణంలో శ్రీనివాస్ వ్యాసాలు ఎంతగానో ఉకరిస్తాయి.
- కోదండరాం
* * *
2000-02 మధ్య కాలంలో దేవులల్లి అమర్ సంపాదకత్వంలో వెలువడ్డ 'ప్రజాతంత్ర'లో వారం వారం రాసిన తెలంగాణ కాలమ్ ఈ కొత్తవంతెన. ఆనాటి నిర్దిష పరిస్థితులమీద వ్యాఖ్యానంగా కనిపించినప్పటికీ, ఈ వ్యాసాల సార్వకాలికమైన అంశాలు, నేటికీ తెలంగాణ ఉద్యమానికి ప్రాసంగికమైన చర్చలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమం ఈ పన్నెండేళ్ళ కాలం చాలా ప్రయాణం చేసి, ఒక గమ్యానికి చేరుకున్నది. అయినప్పటికీ, శ్రీనివాస్ ఆనాడు రాసిన వ్యాసాలు నేటి పాఠకులకు, ఉద్యమ శ్రేణులకు అవరమని భావించి, మేము ఈ ప్రచురణను చేపట్టాము. తెలంగాణవాదానికి 'కొత్తవంతెన' ఒక రిఫరెన్స్ పుస్తకంగా పనికివస్తుందని మా భావన.
- అనేక పబ్లికేషన్స్
ప్రశ్నాక్షరాలు - 'కొత్త వంతెన' పుస్తకంపై ఈనాడు ఆదివారం అనుబంధంలో వచ్చిన సమీక్ష
http://teblog.kinige.com/?p=3390