-
-
కొత్త స్వరాలు
Kotta Swaralu
Author: Dasari Sireesha
Publisher: Alambana Prachuranalu
Pages: 130Language: Telugu
“ఇందులోని కథలు కేవలం ఉహలు కావు. సమాజం ఎలా ఉందో తెలుపుతూ... ఎలా ఉంటే బాగుంటుందో... అందుకు ఏం చేస్తే బాగుటుందో చూసిస్తూ వాస్తవికంగా చిత్రించే కథలు ఇవి.
ఆదర్శాలకు, ఆచరణకు మధ్య... జీవితానికి... వాస్తవికతకు మధ్య వైరుధ్యాలను సమన్వయం చేసుకోవడం అవసరం. ఆ సమన్వయంలో ఎదుర్కొనే సంఘర్షణలను, సంక్లిష్టతలను, ఆశలు, ఆరాటాలను, స్వార్థాలను, మానవీయ బలహీనతలను మహెూన్నత విలువలను, సంస్కృతినీ ఏకకాలంలో చిత్రించిన కథలు ఇవి.
ఇవి కేవలం కథలు కావు. జీవిత సత్యాలు. జీవిత పరిణామాలు, సామాజిక పరిణామాలు కథల రూపం తీసుకున్న కథలు ఇవి”.
- బి.ఎస్. రాములు
“కొత్త స్వరాలు సంపుటిలో మొత్తం 17 కథలున్నాయి. స్త్రీ మనసును ఆవిష్కరించిన కథలు ఇవి.
దాసరి శిరీష గారి కథలలో ఆలోచన, అనుభవం, విశ్లేషణ, తర్కం సమపాళ్ళలో కనిపిస్తాయి. అనుభూతులకు, అనుభవాలకి, వాస్తవికతకు ఒకే రకమైన ప్రాముఖ్యత కనిపిస్తుంది. ఈ బాలెన్స్ చాలా బలంగా ఉండడం వలన ఒక స్థిరత్వం అన్ని కథలలో కనిపిస్తుంది. అందుకే సామాజిక సమస్యలపై, స్త్రీల జీవితాలపై రాసిన కథలయినా వీటిలో అనవసరమైన ఆవేశం కలిగించే వస్తువు కనపడదు.
ఈ కథలలో అంతులేని నిజాయితీ ఉంది, వేదన ఉంది కాని ఆవేశం కనిపించదు. దాని స్థానంలో ఒక పరిపక్వత కనిపిస్తుంది”.
- జ్యోతి

- ₹129.6
- ₹108
- ₹129.6