-
-
కొత్త సూర్యుళ్ళు మొలిచితీరాలి
Kotta Suryullu Molichi Tirali
Author: Ravi Ranga Rao
Publisher: Ravi Rangarao Sahitya Peetam
Pages: 128Language: Telugu
Description
పనమ్మాయి చేతిలో చీపురు కలమే,
రైతు చేతిలో నాగలి కలమే,
మనుషుల కోసం ఏ పనిముట్లు అందుకున్నా కలమే...
***
శబ్దం అంటే ఒకసారి తూలి పడటం,
నిశ్శబ్దం అంటే పదిసార్లు తగిలిన దెబ్బలకు మందు పూసుకోవటం,
తర తరాలనుండి రాత్రికి
పడటం, మందు రాసుకోవటంతోనే తెల్లారుతోంది.
***
మనలో ఎప్పుడూ ఒక ప్రేమ ఆరని జ్వాలలా రగులుతూనే వుండాలి,
సూర్యు డొస్తున్నాడంటే మన మంతా ఎప్పుడూ తూర్పువైపే నిలబడాలి.
***
పువ్వుల్ని తూక మెయ్యటం తప్పు,
పైగా రాళ్ళతో తూక మెయ్యటం ఇంకా పెద్ద తప్పు,
నువ్వు నీ అవసరాల కోసం
తయారుచేసుకొన్న కొలమానాల రాళ్ళతో
తూక మెయ్యటం ఇంకా ఇంకా పెద్ద తప్పు.
***
జీవితం చెట్టుకు పిచ్చి కాయ లెందుకు!
ప్రాణం వెళ్ళిపోయినా నిలిచే “మంచి పేరు" కాయ ఒక్కటి చాలు.
Preview download free pdf of this Telugu book is available at Kotta Suryullu Molichi Tirali
Login to add a comment
Subscribe to latest comments
