-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
కొత్త పలక (free)
Kotta Palaka - free
Author: Anugu Narasimha Reddy
Publisher: Palapitta Books
Pages: 135Language: Telugu
లోపలి ప్రపంచంలో ఒక కదలిక తీసుకురాగల కవిత్వమే సిసలైన కవిత్వం. ఇది భౌతిక వాస్తవాలకు, సంఘర్షణలకు అతీతమైందేం కాదు. మన చుట్టూ వున్న ప్రపంచాన్ని గురించి ఆలోచింపజేస్తూనే ఆత్మలోకంలో ఒక ఆర్తినీ, ఆర్ద్రతనీ ప్రోది చేసే లక్షణంతో కూడి వుంటుంది. అలాంటప్పుడే వైయక్తికమూ, సామాజికమూ కలగలసి ఒక నూతన ఆవిష్కరణకు తావు దొరుకుతుంది. అలాంటి తావు ఏనుగు నరసింహారెడ్డి కవిత్వంలో చూడొచ్చు.
రోజువారీ జీవితంలో ఎన్నెన్నో అంశాలు మనల్ని స్పందింపజేస్తాయి. స్పందనలన్నీ అప్పటికప్పుడు కవిత్వంగా రూపు దాల్చవు. కవి లోపల ఒక రసాయనిక క్రియ జరగాలి. లోపల్లోపలే కవిత ఆవిష్కారం కావాలి. ఆపైన అభివ్యక్తం కావాలి. అలాంటి కవితామయ జగత్తు ద్వారా మాత్రమే కవిలో వచ్చిన కదలిక పాఠకునిలో పునర్వికాసం చెందుతుంది. ఇందుకు దోహదం చేసే సృజనాత్మక శక్తి వున్న కవి నరసింహారెడ్డి. అందుకే ఇష్టంగా, ప్రేమగా చదువుకునే కవిత్వంగా రూపుదిద్దుకుందీ సంపుటి. వస్తువులో వైవిధ్యం, నిర్మాణంలో స్నిగ్ధత్వం, భాషలో నిరాడంబరత్వం, ఊహాశాలితలో వైశిష్ట్యం సంతరించుకున్న కవిత్వమిది.
పల్లెతో, పట్నంతో, నగరంతో జీవన సంబంధం వున్న నరసింహారెడ్డికి జీవితంపై, సమాజంపై నిశితమైన అవగాహన వుంది. దీనితోపాటు కవిత్వం అంటే ఏమిటో తెలుసు. కవిత్వ నిర్మాణంపై శ్రద్ద వుంది. వాక్యాల్ని పోగు చేయడం కాదు, వాక్యాలకు జీవశక్తిని, రసపుష్టిని అందించి సత్కరించడం తెలుసు. అందువల్లనే నరసింహారెడ్డి కవిత్వాన్ని మరింత మమకారంతో పాఠకలోకానికి అందిస్తున్నాం.
- పాలపిట్ట బుక్స్
