• Kotta Bangaru Lokam
  • fb
  • Share on Google+
  • Pin it!
 • కొత్త బంగారులోకం

  Kotta Bangaru Lokam

  Language: Telugu
  Rating
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  Be the first to vote
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

రచయత స్వంత మాటల్లో
నేను కథలు ఎందుకు వ్రాశాను?
రాక్షసులు దేవతల్లాగా వేషాలు వేసుకుని
మేం దేవతలమే అని దబాయిస్తుంటే
వాళ్ళు రాక్షసులే అని
వేలెత్తి చూపగల ధైర్యమూ,
పారదర్శకత లేని విధానాలూ, రాజకీయ నాయకులకి
సాగిలపడే అధికార్ల వ్యవస్థా,
లోపభూయిష్టమైన న్యాయశాస్త్రం -
ఇవే ప్రజాస్వామ్యాన్ని కోమాలోకి నెట్టాయనే ఎరుకా,
వీటికి బాధ్యత అనే ఔషదం దివ్యంగా పని చేస్తుందనే గ్రహింపూ,
పద్మవ్యూహం లోనుండి వెనక్కు రాలేమని తెలిసినా ముందుకు చొచ్చుకుపోవాలనే తెగింపూ,
టెలివిజన్ అనే రంగులరాట్నం ఎక్కి ఎక్కడకీ చేరలేమనే జ్ఞానమూ మీకుంటే
మిమ్మల్ని అభినందించడానికీ, ఉత్సాహపరచడానికీ కథలు వ్రాశాను.
పై భావనలేవీ మీకు లేకపోతే మీలో వాటిని ప్రోదిచెయ్యడానికీ, బాధాసర్పదష్టులకి
కొత్త బగారులోకాన్ని మనమే సృష్టించగలమనే నమ్మకం కలిగించడానికీ
మీ కోసమే (ఈ)కథల్ని వ్రాశాను.
- అనిసెట్టి శ్రీధర్
పాపినేని శివశంకర్ అభిప్రాయం
పాత్రపోషణలో మనస్తత్వ విశ్లేషణ ప్రధానమైంది. కానీ ఆధునిక రచయితలు ఈ మధ్య ఉద్యమావేశాల వల్ల గాని, ఇంకెందువల్లనైనా గాని - ఈ అంశానికి తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదు. అంతేకాకుండా వైవిధ్యభరతమైన కథా వస్తువుల్ని ఎన్నుకొవడం కూడా అవసరం. ఉద్యమాలు స్ప్రుశించాల్సిన జీవిత విభాగాలు అనేకం మిగిలి ఉన్నాయి. ఈ చూపుతో పరిశీలిస్తే అనిసెట్టి శ్రీధర్ వ్రాసిన 'మగాడి పశ్చాత్తాపం' అనే కథ పురుష మనోవిశ్లేషణతో అద్భుతంగా సాగింది. దేశ పర్యటన అనే సరికొత్త ఇతివృత్తం గ్రహించి శ్రీధర్ 'కొలంబస్' అనే ఆసక్తికరమైన కథ వ్రాశాడు. యాంత్రిక జీవన విధానంతో కలుషితమైన నిలవనీటి బ్రతుకుల కొక కదలిక ఈ కథ.
(దక్షిణ తీరాంధ్ర కథ, వ్యాసం నుండి)
- పాపినేని శివశంకర్.

మరిన్ని వివరాలు
ఈ పుస్తకం రచన, ఆంధ్రజోతి, నవ్య, ఇండియా టుడే, విపుల వంటి పత్రికల్లో ప్రచురించబడి విమర్శకుల ప్రశంసలు విరివిగా అందుకున్న అనిసెట్టి శ్రీధర్ కథల సంకలనం. మునిపల్లెరాజు గారి ముందుమాటతో, మొత్తం పదిహేను కథలు ఇందు కూర్చబడ్డాయి.
మేలిమి కథా సంకలనం - ఇండియా టుడే
జి.వి.ఎస్. మూర్తి
మానవ ప్రపంచం అందంగా ఎందుకుండదని నిలదీసే యువ రచయిత అనిసెట్టి శ్రీధర్ కథా సంకలనం: 'కొత్త బంగారు లోకం'. గోపాలం మంచి బాలుడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఈ కాలం వాడు కాదు. అలాంటి గోపాలానికి కావలసిందేమిటో వివరించిన కథ మద్దతుతో కొత్త బంగారు లోకం పాఠకుల ముందు తలుపులు తెరచుకుంటుంది. గోపాలానికి ఏం కావాలో కనుగొనడం ద్వారా రచయిత మరో మంచి బాలుడుగా సాక్షాత్కరిస్తారు.
అదే సమయంలో ఈ రచయిత ఓ అసాధ్యుడు కూడా అని రెండో కథలోకి వెళ్ళేసరికే మనకు స్ప్రుహ కలుగుతుంది. సర్దుకు పోవడమేమిటని ప్రశ్నించే విశాలిని, సర్దుకు పోకపోవడమా అని ఆశ్చర్యపడే లీలను ఒక కోళ్ళ ఫారం నేపధ్యంలో ఇలా మాటల్లో పెట్టి, అలా ఆర్థిక స్వాతంత్ర్యాన్ని గురించి కొక్కొరొకో అని అలారం మోగించేస్తారు రచయిత. "పాత సామాను మధ్యలో ఎక్కడ కలిసి పోయిందో గమనించి ఉండను" అంటూ ముసలి అవ్వ నిర్లక్ష్యానికి గురవుతున్న తీరును ధ్వనించడం ద్వారా మూడో కథలో, రచయిత అక్షరాలను బంగారు శిల్పమంత అపురూపంగా చెక్కడం పాఠకులకు ముచ్చట గొలుపుతుంది. పిల్లలకు సున్నితత్త్వాన్ని విశదం చేయడానికి తల్లులు ఎవరైనా సిలబస్‌కోసం వెదుకుతున్నట్లైతే, అందుకు సిద్ధంగా దొరికే పాఠ్యపుస్తకంగా కొత్త బంగారు లోకంను హాయిగా సిఫార్సు చెయవచ్చు. అందుకు ఈ పాత సామాను కథ ఒక్కటే చాలు. ఒకానొక పోటీలో ప్రథమ బహుమతి పొందిన ఈ కథతో పాటు, అలాంటివే అనేక ఉత్తమ కథలను పొదిగిన ఈ సంకలనానికి ముందు మాట వ్రాస్తూ ప్రముఖ కథకులు మునిపల్లె రాజు, అకళంక అంతర్ముఖుడుగా రచయితను పరిచయం చేస్తారు. నిశ్శబ్దంగా, కుర్చీలో ముడుచుకుని కూర్చుని కనిపించాడీ రచయిత అని ఆయన వ్రాశారు. కొంత జోడించి చెప్పాలంటే, చుట్టూ జరుగుతున్న దానిని డేగ అంత నిశితంగా గమనించడం కోసమే ఆ నిశ్శబ్దాన్ని సైతం విశ్లేషించి, స్వరాలు కట్టే నైపుణ్యం ఈ రచయిత సొంతమూ అనిపిస్తుంది ఈ పుస్తకంలోని కథలను చదువుతుంటే, పాత్రల నిజ జీవితాలలోని అపస్వరాలు అన్నింటినీ నిశ్శబ్దంగా కనిపెట్టేసి, వాటిని తన అక్షరాలలో ఏ అపస్వరం లేకుండా చెబుతారు శ్రీధర్. సహాయం అనే కథలో శ్రీధర్‌లోని యుక్తిపరుడు ప్రత్యేకంగా ఉట్టిపడుతాడు. కులపిచ్చి గురించి వ్రాసేటప్పుడు ఏ కులం పేరు పెట్టి వ్రాసినా చిక్కే. అందుకే శ్రీధర్ 'కా ' అనే కులాన్ని తీసుకుని కథ నడిపించేశారు. "కా " అనేది ఏ కులమా అని ఎవరూ బుర్ర బద్దలు కొట్టుకోనవసరం లేదు. అది అన్ని కులాలనూ ఉద్దేశించి వ్రాసినదని సవినయంగా మనవి చేసుకోవడం, గడసరి రచయిత సృజనాత్మతకు కొసమెరుపు. డబ్బు కాటు తిన్నాక ఆధ్యాత్మికం సైతం ఎలా నల్లబడిపోతుందో రచయిత నెత్తురు కూడు అనే కథలో అద్దం పట్టారు. ఈ కథ, ఆయనలోని ఆవేదనాభరిత అంతరంగాన్ని చాటుతుంది. 15 కథల సంపుటంలో రచయిత దృష్టిలో హైలైట్ సహజం గానే టైటిల్ కథ: కొత్త బంగారు లోకం కావాలి. చదివించే ఉత్కంఠ, ఆఖరికి మనకు తెలిసిన సందేశాన్నే మనం ఊహించలేనంత బలంగా, అందంగా, కొస మెరుపుగా మెరిపిస్తారు శ్రీధర్. "మొన్నొక ఆఫీసరు వాళ్ళ నాన్న తద్దినానిక్కూడా డబ్బులు వసూలు చేశాట్ట" లాంటి చురకలు కూడా వేసే ఈ రచయితలో ఆవేశం చాలా ఉన్నా, దానిని చాటుకోవడానికి ఎక్కడైనా దుర్బాషను వాడారా అంటే, బొత్తిగా అలాంటి ప్రసక్తే లేదు. అందుకే చెప్పి తీరాలి: నలుసంత రాగి అయినా కలపని కొత్త బంగారు లోకం ఈ కథల పుస్తకం.

వైవిధ్యభరత కథాసంపుటి (వార్తా దిన పత్రిక)
ప్రముఖ కథా రచయిత అనిసెట్టి శ్రీధర్ రచించిన "కొత్త బంగారు లోకం" కథా సంపుటిలో వైవిధ్యభరత మనస్తత్వ విశ్లేషణాత్మకమైన 15 కథలున్నాయి. ఇందులో మానవతా దృక్పథానికి అద్దం పట్టే కథలున్నాయి. పురుషాధిక్యతను నిరసించే స్త్రీ వాద భావుకతలున్నాయి. నీతి, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనాలైన ఉదాత్త ఇతివృత్తాలున్నాయి. ప్రయోగాత్మక వ్యంగ్య కథలున్నాయి.
నీతి, నిజాయితీతో కూడిన ఊహాత్మక ఆదర్శ సమాజాన్ని సృష్టించడమే కొత్త బంగారులోకం ఇతివృత్తం. కథలన్నింటా కొత్త బంగారు లోకాన్ని సృష్టించడానికి అనువైన ఇతివృత్తాలు, ఉదాత్తమైన పాత్రలున్నందున ఈ కథాసంపుటి శీర్షిక ఔచిత్యంగా ఉంది.
కథలన్నింటా ఉత్కంఠతో కూడిన ఆరంభం, ఔచిత్యమైన ముగింపు, పాఠకులచేత చదివించే సంవాద చాతుర్యం వంటి లక్షణాలున్నాయి. వీటికితోడు సంక్షిప్తత, ఏకాంశవ్యగ్రత, నిర్భరత, స్వయం సమగ్రత వంటి ఉత్తమ కథానిక లక్షణాలు పాటించబడ్డాయి. పాత్రలన్నీ ఉదాత్తంగా చిత్రించబడ్డాయి. కొత్త బంగారులోకం రావాలన్న రచయిత ఆకాంక్ష నెరవేరుతుందని ఆశిద్దాం.
- డాక్టర్. పి.వి.సుబ్బారావు.
Preview download free pdf of this Telugu book is available at Kotta Bangaru Lokam
Comment(s) ...

అదిగో నవలోకం !
వెలిసే మనకోసం !!

ఆధునిక జీవితాన్ని చిత్రీకరించాలంటే కథానికకు మించిన ప్రక్రియ సాహిత్యంలో మరొకటి లేదు. వేగవంతమైన ఈనాటి జీవితంలో దృశ్యాలు తప్ప దుఖాలు లేవు. దృశ్యాలను విశ్లేశించుకునే సమయమూ, తీరుబడీ కూడా లేవు. "చూసేశాం ! అయిపోయింది" అనుకోవడమేగాని ఆత్మశోధనలు, అంతరంగ పరిశోధనలూ కనిపించవు గాక కనిపించవు.

_ ఈ విశయాలను బాగా ఆకళింపు చేసుకున్నాడు అనిసెట్టి శ్రీధర్. దృశ్యాలు దృశ్యాలుగా కథలను పేర్చి "కొత్త బంగారులోకం" అని పేరు పెట్టి చేతులు కట్టుకుని పాఠకుల ముందు ఒద్దిగ్గా నిలుచున్నాడు. ఈ కథల్లో హైబ్రిడ్ కథనం లేదు. అర్థం లేని వ్యాఖ్యానాలు లేవు. చక్కని శైలి ఉంది. హాయిగా చదివించే తెలుగు _ తెలివీ ఉన్నాయి. కథ చదువుతుంటే ఊపిరి ఆడకపోవడం, ఆయాసపడడంలాంటి ఇబ్బందులు లేవు. "అమ్మో" అనుకునేంత భయాలూ లేవు. అయితే చిత్రంగా పాఠకునికి లేని దుఖాలూ, బాధలూ రచయితకి ఉన్నాయి. ఉండబట్టే "స్పృహ", "పాత సామాను" లాంటి కథలు రాసి "నిరంతర అంతర్, బహిర్ యుద్ధారావమే తన రచనా వ్యాసంగం" అని తెలియజేశాడు.

సంకలనంలో మొత్తం పదిహేను కథలున్నాయి. ఈ కథలన్నీ బాగున్నాయి. ఎంత బాగున్నాయంటే కథల్లో కథలనిపించే "స్టోరీ బైట్స్" కూడా కళ్ళని కట్టిపడేస్తాయి.

* తప్పు చేసి చెయ్యి జాపి మేస్టారి చేతిలో బెత్తం దెబ్బలు తిన్నాను కానీ తప్పు చెయ్యడానికి ఏనాడూ నేను చెయ్యి చాపలేదు (మద్దతు)
* బలహీనవర్గాల కోసం అంతే బలహీనంగా ఇళ్ళు కడతాడని ఆయన మీదో జోక్ ఉంది (నెత్తురు కూడు)

* మేం రెక్కల్లేని పక్షులం
మేం బావిలో కప్పలం
మేం బోన్ సాయ్ మొక్కలం
మేం గోడకు వేలాడే బూజులం
మేం తీవెలేని వీణలం
మేం తావిలేని పూవులం (కొలంబస్)

- పరమాణువు పరితాపాలను తెలుసుకున్నట్టున్న శ్రీధర్ కథను చెప్పడానికి పేజీలు, పేజీలు అఖ్క ర్లేదంటూ ఒకటి రెండు వాక్యాల తోనే కథంతా చెప్పగలగడం అత్యాధునిక శిల్పానికి శ్రీకారం చుట్టడమనిపిస్తోంది. అందుకు ఉదాహరణ: కోళ్ళ ఫారంలో శాశ్వతంగా పనిచేసేదెవరో అర్థమయింది విశాలికి. కేజెస్ లో ఉన్న కోళ్ళకు తమకు స్వాతంత్ర్యం లేదన్న స్పృహ కూడా లేదేమో అన్న లీల మాటలు గుర్తుకు వచ్చాయి. మరి లీలకు? (స్పృహ)

- ఈ రకంగా అనిసెట్టి శ్రీధర్ కథలు ఆలోచింపచేయడమే కాదు, మనల్ని ప్రశ్నిస్తాయి. జవాబులు వెతుక్కోమంటాయి. జవాబులు తెలిస్తే కథే వేరు. మరి ఆలస్యం దేనికి, చదవండి.
- జగన్నాధ శర్మ (Andhra Jyothy review)