• Kotappakonda
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కోటప్పకొండ

    Kotappakonda

    Publisher: S.R. Book Links

    Pages: 60
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండ, గుంటూరు జిల్లాలో నర్సరావుపేటకు 15 కి.మీ., చిలకలూరిపేటకు 17 కి.మీ. ల దూరంలో ఉంది. కొండకావూరు గ్రామపరిధి లోనున్న ఈ కొండ, యల్లమంద, కొండకావూరు గ్రామాల మధ్యన ఉంది. భూమట్టం నుంచి 1586 అడుగుల ఎత్తుతో నున్న కోటప్పకొండ 12 కి.మీ.ల చుట్టుకొలతతో 1500 ఎకరాల్లో విస్తరించి ఉంది. కొండమీద వెలసిన స్వామిని త్రికోటీశ్వరుడనీ, కోటప్ప అనీ, కోటయ్యఅనీ భక్తులు కొలుస్తున్నారు.

గుంటూరుజిల్లా నకరికల్లు మండలం, చేజర్లవద్ద పుట్టిన వొంగేరు లేక ఒంగేరు నది ఈ కొండకు దక్షిణంగా ప్రవహించటంవల్ల కోటప్పకొండ తీర్థక్షేత్రమైంది. ఈ ఓగేరునదిని, జోగేరు, ఓంకారనది అనికూడా పిలుస్తారు. ఇది చిలకలూరిపేట వద్ద జాతీయ రహదారిని దాటి, పెదనందిపాడు, కొండపాటూరు, ఇనుగర్తి , పెదచెఱుకూరు, పూండ్ల, అప్పికట్ల, గుడిపూడి, బుద్ధాం, గణపవరం మీదుగా ప్రవహించి, నిజాంపట్నం దగ్గర సముద్రంలో కలుస్తుంది.

Preview download free pdf of this Telugu book is available at Kotappakonda