-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
కొర్రపాటి గంగాధరరావు నవలానుశీలన (free)
Korrapati Gangadhara Rao Navalanuseelana - free
Author: Dr. G. Venkata Lal
Publisher: Self Published on Kinige
Pages: 205Language: Telugu
‘రంగ రచనా ప్రవీణ, కళా ప్రవీణ' బిరుదులు గల డా|| కొర్రపాటి గంగాధరరావు వృత్తి రీత్యా డాక్టరు ప్రవృత్తి రీత్యా నాటక రచయిత, ప్రదర్శకుడు, నవలా రచయిత, కథా రచయిత, వ్యాస రచయిత, సినిమా రచయిత. వీటితో పాటు రేడియో నాటకాలు, పద్యాలు, ఫ్రీవర్స్ గేయాలు, కవితలు మొదలైన ఎన్నో రచనలు చేసారు. గంగాధరరావు రచనలన్నీ సాంఘికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, చారిత్రకంగా అణగారిన సమాజ పరిస్థితులను ఎత్తి చూపించి, వాటికి పరిష్కార మార్గాలను చూపిస్తూ, సమాజాన్ని చైతన్యపరిచే విధంగా ఉంటాయి. ప్రతి రచన సామాజిక ప్రయోజనాన్ని కల్గించేలా ఉంటాయి.
గంగాధరరావు సాహిత్యం నన్ను ఆకర్షించటం వల్ల అతని రచనల మీద పరిశోధన చేయాలని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో యం.ఫిల్ చేస్తున్నప్పుడు సంకల్పించారు. వీరి రచనలు అనేక ప్రక్రియల్లో ఉండటం వల్ల, నా పరిశోధనను ఒక్క నవలా ప్రక్రియకు మాత్రమే పరిమితం చేసి, 'కొర్రపాటి గంగాధరరావు నవలలు-అనుశీలన' అనే అంశాన్ని పరిశోధనాంశంగా ఎన్నుకొన్నాను. తెలుగులో పిహెచ్.డి. చేయాలనే నా ఆశకు ప్రతిరూపమే ఈ పరిశోధన.
తెలుగులో నవలలు అనేకం ఉన్నప్పటికి కొర్రపాటి గంగాధర రావు నవలలు ఒక ప్రత్యేకతను కలిగి వుంటాయి. అందుకే 'కొర్రపాటి గంగాధర రావు నవలలు - అనుశీలన' అనే పరిశోధనాంశాన్ని ఎంచుకొన్నాను. గంగాధరరావు జీవితం, సాహిత్యం మొదటి అధ్యాయంలో వివరించబడ్డాయి. గంగాధరరావు నవలల్లో ఉన్న ఇతివృత్తాలు రెండవ అధ్యాయంలోనూ, పాత్ర చిత్రణలు మూడవ అధ్యాయంలోనూ, సామాజిక ప్రయోజనాలు నాల్గవ అధ్యాయంలో వివరించబడ్డాయి. ఐదవ అధ్యాయంలో నవలాకారునిగా గంగాధరరావు స్థానాన్ని తెలిపే వర్ణనలు, ఆలంకారిక శైలి, మాండలిక భాష, జానపద సాహిత్యం, జాతీయాలు - సామెతలు, విలక్షణాలు వివరించబడ్డాయి.
- డా. జి. వెంకట లాల్
