-
-
కొండేపూడి నిర్మల కవిత్వం
Kondepudi Nirmala Kavitvam
Author: Kondepudi Nirmala
Pages: 290Language: Telugu
కొండేపూడి నిర్మల ప్రముఖ స్త్రీవాద కవయిత్రి. 1980 దశకంలో తెలుగు సాహిత్యంలోకి ఉవ్వెత్తున ఎగిసిపుతూ వచ్చిన స్త్రీవాద కవయిత్రుల్లో మొదటి వరస సిపాయీ... ఈమె కవిత్వం ఎంతోమందిని ప్రభావితం చేసింది. అప్పటివరకూ అంటరానివిగా మిగిలిపోయిన ఎన్నో కొత్త వస్తువులను స్వీకరించి, కవిత్వం రాసినవారిలో కొండేపూడి నిర్మలని ట్రెండ్ సెట్టర్‌గా అభివర్ణించవచ్చు. ఈమె కలంలోంచి తొణికిన ఏ రచనని పరిశీలించినా గాని ఒక ఆర్తితో కూడిన తీవ్రత కనబడుతుంది.
ఈమె కవిత్వంలోనే కాదు ఇతర సాహితీ ప్రక్రియల్లో కూడ తనదైన ముద్రవేశారు. కవిత్వంలో గాఢతలాగే వచనంలో వ్యంగ్యం, హాస్యం ఈమె ప్రత్యేకతలు.
ఈమె తాపీ ధర్మారావు స్మారక బహుమతి, ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు, నూతలపాటి గంగాధరం అవార్డ్, కుమారన్ ఆశాన్ జాతీయ బహుమతి, దేవులపల్లి కృష్ణశాస్త్రి అవార్డ్, బి.ఎన్. రెడ్డి సాహితీ అవార్డు, ఎస్.బి.ఆర్ అవార్డ్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అవార్డ్ వంటి పురస్కారాలు ఎన్నో పొందారు.
నిర్మల ఇప్పటివరకూ వెలువరించిన సందిగ్ధ సంధ్య, నడిచే గాయాలు, బాధాశప్తనది, మల్టీనేషనల్ ముద్దు, నివురు అనే అయిదు కవితా సంకలనాల సంపుటం - ఈ పుస్తకం.
