-
-
కొండచిలువ కథానికలు
Kondachiluva Kathanikalu
Author: Dr.Shanthi Narayana
Publisher: Sri Vedagiri Communications
Pages: 183Language: Telugu
'కొండచిలువ' అనే ఈ సంపుటిలోని పది కథలలో 'బతుకు వేదం' అనే తొలికథ తప్ప తక్కిన తొమ్మిది కథలు 21వ శతాబ్దంలో రాసినవే. రెండూ మూడు కథలు తొలి దశాబ్దంలోను, తక్కిన ఏడు కథలూ రెండవ దశాబ్దం లోనూ మొత్తం 2005-14 మధ్య పదేళ్లలో రాసిన కథలు. ఈ తొమ్మిది కథలకూ ఈ శతాబ్ది ప్రారంభ రాజకీయార్థిక నేపథ్యముంది. ఈ కథలన్నీ అనంతపురం జిల్లాలోనే జరుగుతాయి. ఈ కథలన్నీ ప్రపంచీకరణ మానవ జీవితాన్ని ఒక రూపంలో ప్రభావితం చేయడాన్ని చిత్రించాయి. కరువుతో సతమతమవుతున్న అనంతపురం జిల్లా మీద ప్రపంచీకరణ రెండవ దశ దుష్ప్రభావ చిత్రణే శాంతినారాయణ కథానికల సారం. 'మోహినీ మోహనం' తప్ప తక్కిన కథలన్నీ ఉత్తమ పురుషలోనే చెప్పబడ్డాయి. ఉత్తమ పురుష అనుభవ కథనానికి, ఆత్మీయ కథనానికి చక్కని సాధనం. శాంతి నారాయణ ఈ సాధనాన్ని బాగా ఉపయోగించుకున్నారు.
ఈ కథలన్నీ ఇవాళ రావలసిన కథలే. భారతీయ కథానికా సాహిత్య సమూహంలో ఇవీ భాగమే. అనంతపురం జిల్లా వంటి కరువు పీడిత ప్రాంతం నుండి ధర్మాగ్రహంతో ఒక కథకుడు ఈ కథలలో అనేక వ్యాఖ్యలు చేశారు. అనేక విషయాలు ప్రస్తావించాడు. వాటిలో ఆగ్రహం, ఆవేదన గూడుకట్టుకొని ఉన్నాయి. అవి నిజాయితీ సిరాతో కథల రూపం పొందాయి.
- రాచపాళెం చంద్రశేఖర్రెడ్డి
