-
-
కొల్లేటి జాడలు
Kolleti Jaadalu
Author: Akkineni Kutumbarao
Publisher: Swechcha Prachuranalu
Pages: 220Language: Telugu
కుటుంబరావు గారి ‘కొల్లేటి జాడలు’ నవల చదువుతున్నంత సేపూ, ముగించిన తరువాతా కూడా కళ్లనిండా అవే దృశ్యాలు. చదివి మనం ఊహించుకునేవి కావు. రచయిత దర్శకుడు ప్రతీ దృశ్యాన్ని తన ఏంగిల్లో కెమేరా నిలబెట్టి చిత్రానువాదాన్ని మనకి చూపిస్తున్నారు. ఈ నవలలో కనిపించే పిక్టోరియల్ క్వాలిటీ దాని ప్రధాన ఆకర్షణ. అందుకే దోనెలో కూచుని కొల్లేటిలో తిరుగుతున్న అనుభూతిని కలగచేస్తుంది. ఈ నవల ముగించిన కొన్ని రోజుల వరకూ కొల్లేటి దృశ్యాలు మనసుని కమ్ముకుంటాయి. కమ్ముకోవడం ఎందుకంటే కొల్లేరు ఒక జీవావరణ, జీవన, పాలనాపరమైన విషాదం ఇప్పుడు.
- తల్లావఝుల పతంజలి శాస్త్రి
కొల్లేరు తీరం వెంబడి ఉండిన అటువంటి గ్రామాలన్నిటా – సహజంగానే – వంటా, తిండీ, పనీ పాటూ, గొడ్డూ గోదా, సంబరం వినోదం, అలవాట్లూ ఆచారాలూ ఇవన్నీ కూడా అక్కడ దొరికే చేపల చుట్టూ, పండే పంటల చుట్టూ పరిభ్రమిస్తూ వచ్చాయి. ఆ మేరకు ప్రకృతితో, స్థానిక భౌగోళిక నిర్దిష్టతలతో పెనవేసుకు పోయాయి. ఈ సహజ సంబంధాన్ని ’కొల్లేటి జాడలు’
మనోహరంగా చిత్రిస్తుంది. ఇవేమీ తెలియని పాఠకులకు ఒక ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. ఈ నవలలోని సమాజం, బాగా ’అభివృద్ధి’ చెందిన మైదాన ప్రాంతాల కన్నా ’వెనుకబడిన’ గిరిజన సమాజానికి దగ్గరలో ఉన్నట్లుగా కనిపిస్తుంది.
- ఉణుదుర్తి సుధాకర్
మీరు మీ చిన్ననాటి జాడల్ని వెతుక్కుంటూ నన్ను నా బాల్యంలోకి నెట్టి అక్కడ నేను పారేసుకున్న స్మృతులన్నింటినీ పోగు చేసుకుని పదిలంగా దాచుకునేట్టు చేసారు. ఇంకా నేనెప్పుడో చదివిన గోల్డ్‌స్మిత్ కావ్యం ’పాడు బడ్డ పల్లె’నీ, నయ్పాల్ గారి ఉద్గ్రంధం “బిశ్వాస్ గారి ఇల్లు’ని షోలకోవ్ రాసిన ఉత్తమ నవల ’బీళ్ళు దున్నేరు”ని, ఇంకా ఎన్నో ఆధునిక స్థలపురాణాలనీ గుర్తుకి తెచ్చేరు.
- డా. కృష్ణమూర్తి
