• Kokkoroko - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • కొక్కొరోకో (free)

    Kokkoroko - free

    Publisher: Nrusimha Kalapeetam

    Pages: 60
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

‘జాతి జీవనానికి జానపదగీతం' అన్నాడో మహాకవి. మానవజాతి పరిణామక్రమంలో మొదట అక్షరరహితమైన పాట పుట్టి, మాటల పుట్టుకకు నాంది పలికింది. ఆ తర్వాత వాగ్రూపభాష పదాల్లో (పాటల్లో) విస్తరించి పదాల (పాటల) రూపకల్పనకు భూమికగా నిలిచింది. పదకవితాపితామహుడు అన్నమయ్య మొదలు ఎందరో వాగ్గేయకారులు ఈ నేల మీద అవతరించారు, అవతరిస్తూనే ఉన్నారు. సంగీతానికి మనసులను కరిగించే శక్తి ఉన్నది. మాటకు మనిషిని కదిలించే శక్తి ఉంది. మాటకు సంగీతం తోడైతే మహత్తరశక్తిగా మారి, సమాజాన్ని ఉర్రూతలూగిస్తుంది. ఇది తరతరాలుగా రుజువవుతూనే ఉన్నది. ఆ పాట సంకీర్తనగా మారి భక్తి పరిమళాలను వెదజల్లింది. భజనగా మారి సమాజ సదాచారానికి బాటలు వేసింది. పాటగా మారి నవరసభావాల ఊటలకు ఏతమెత్తింది. ఉద్యమాలకు ఊపిరులూదింది. స్రోతస్వినియై కలుషాలను కడిగి స్వచ్ఛవర్తనకు మార్గం చూపింది. నాటకాల్లో, రూపకాల్లో, సినిమాల్లో, టీవీల్లో విస్తరించి, విశ్వరూపం ప్రదర్శించి, మనో యవనికల మీద ఇంద్రధనుస్సులను నింపింది. అటువంటి పాటల అనేకరూపాల్లో మమైకమై, సంగీతసారస్వతమై తెలుగునేలలో ప్రవహించిన కుటుంబం ముడుంబైవారిది. ఆ వంశాంకురమే డా.యం.పురుషోత్తమాచార్యులు.

సంగీతసాహిత్యాల సమ్యక్ సత్వరూపం ఈ పురుషోత్తములు. ఉత్తమ ఉపాధ్యాయులుగా భావితరాలను తీర్చిదిద్దుతూనే సంగీతసాహిత్యాలలో కూలంకషతను కనబరచిన ప్రజ్ఞామూర్తి విద్వచ్ఛిరోమణి. చిత్రపరిశ్రమకు తొలి తెలుగు పాట నందించిన చందాల కేవవదాసు మీద పరిశోధన చేసి తన సారస్వతశక్తిని జగతికి చాటిన పండితకవి పురుషోత్తమాచార్య తమ తండ్రిగారైన ముడుంబై వేంకట నరసింహాచార్యులు గారి పేర ఒక ప్రచురణ సంస్థను స్థాపించడమే కాక, వారి శతజయంతి ఉత్సవాలలో భాగంగా వర్థమానకవుల పాటల నొక్క మేల్కొలుపు (కొక్కొరోకో)మాలగా సవరించి అంజలి ఘటించాలని నిర్ణయించడం అటు తండ్రిగారికి కృతజ్ఞతలు సమర్పించడంతో పాటు పాటకు, వర్గమానగేయరచయితలకు సగౌరవంగా పూగుత్తిని సమర్పించినట్లుగా నేను భావిస్తున్నాను.

ఈ సంకలనం కోసం పాటల నందించినవారిలో అత్యధికులు క్రొత్తవారే. ఇందులో ఈ సంకలనం కోసమే కలం పట్టినవారూ ఉన్నారనిపిస్తున్నది. చాలా తక్కువ సమయంలో ఈ పాటలను సేకరించి, పాఠకలోకానికి అందించడం ప్రశంసనీయం.

- దోరవేటి