• Kittugadu Inter Fail IAS Pass
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 129.6
    144
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కిట్టుగాడు ఇంటర్ ఫెయిల్, ఐ.ఏ.ఎస్. పాస్

    Kittugadu Inter Fail IAS Pass

    Author:

    Pages: 147
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

హైస్కూలులో ఒకరోజు సైన్సు మాస్టారు ఒక ప్రశ్న వేశారు. ‘‘శరీరంలో నల్లదనానికి కారణమయ్యే పదార్థం ఏమిటి?”

ఇది సిలబస్‌లో ఎక్కడా లేదు. ఈ విషయం మాస్టారికి కూడా తెలుసు.... ముందుగా క్లాసంతటికీ తెలివైన నెంబర్‌వన్‌ విద్యార్థి వైపు చూస్తూ, వేలితో సైగ చేశారు మాస్టారు. ఆ విద్యార్థి సైలెంట్‌గా లేచి నిల్చున్నాడు.... సమాధానం లేదు. అలాగే నిలబడమన్నారు మాస్టారు. తర్వాత ఇంకో తెలివైన విద్యార్థి... నిలబడ్డాడు.... ఆ తర్వాత ఇంకో విద్యార్థి.... నిలబడ్డాడు....... ఎవర్నీ కూర్చోండి అనడంలేదు మాస్టారు.......

ఆడపిల్లలో తెలివైన వాళ్లూ, తెలివైన వాళ్లుగా గుర్తించబడ్డ వాళ్లూ ఉన్నారు. వాళ్లు కూడా అందరూ ఒకరికొకరుగా లేచి నిలబడ్డారు.... మాస్టారికి పట్టుదల పెరిగింది.... నెక్స్ట్... నెక్స్ట్.... అంటూనే ఉన్నారు. వరసగా క్లాసులోని ‘యాభై తొమ్మండుగురు’ లేచి నిలబడ్డారు. చివరగా గుర్తింపులేని కిట్టూ మిగిలాడు. ఓ...కే.. సమాధానం ఏమిటంటే.... అన్నారు మాస్టారు.

కిట్టులో చలనం వచ్చింది. సార్‌... నేను సార్‌... అన్నాడు. అరే.. వీడు చెప్తాడంట...వినండిరా... వ్యంగ్యంగా అన్నారు మాస్టారు.

మాస్టారి వ్యంగ్యానికి కారణం ఉంది. కిట్టు క్లాస్‌లో ఏవరేజ్‌ కంటే తక్కువ. తెలివి అంతంత మాత్రం. ఆకారం... రూపం… అంతంత మాత్రం.... పిల్లలంతా పకపకా నవ్వారు. క్లాసులో నెంబర్‌ వన్‌ నుండి నెంబర్‌ టెన్‌ వరకు చెప్పలేనిది... వీడేం చెప్తాడు ? అనుకున్నారు అందరూ....

కిట్టు పైకి లేవకుండానే కూర్చొనే ‘మెలానిన్‌’ అన్నాడు.

‘సరియైన సమాధానం చెప్పేవాడు నిలబడడు, చెప్పలేకపోతే నిలబడతాడు’ ఇది క్లాస్‌రూం రూల్‌..

క్లాసులో నవ్వులింకా ఆగలేదు. మాస్టారి చెవికి మాత్రం సమాధానం అందింది. ఆయనకు నమ్మబుద్ధి కాలేదు. ఏంట్రా...... మళ్లీ చెప్పు ? అన్నారాయన.

కిట్టుకి భయం వేసింది. కొద్దిగా ఆలోచించాడు. తప్పయితే అయ్యింది... ఎప్పుడూ తినే బెత్తం దెబ్బలే కదా... కొత్తగా ఏం పోయింది?

‘మెలానిన్‌’ సార్‌... అన్నాడు.

‘కరెక్ట్‌’ అన్నారు మాస్టారు.

క్లాస్‌లో ఆశ్చర్యం వ్యక్తమయింది. వీడికెలా తెలుసు?

* * *

సివిల్స్, గ్రూప్స్, రాసే ప్రతి ఒక్కరూ చదివితీరాల్సిన చక్కని 'సామాజిక నవల'.

Preview download free pdf of this Telugu book is available at Kittugadu Inter Fail IAS Pass
Comment(s) ...

pls do let me know where to buy this book copy from andhra pradesh