• Kitikilonchi Vana
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కిటికీలోంచి వాన

    Kitikilonchi Vana

    Pages: 206
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ సంపుటిలో నక్షత్రాల్లా 27 కథలు వున్నాయి. ఆకెళ్ల శివప్రసాద్‌ కథనశైలిలో ప్రత్యేకత వుంది. ఇతివృత్తాలలో సింప్లిసిటీ వుంది. ఒక కథలో అనేక విషయాలు చెప్పాలనే అతి తాపత్రయం కనిపించదు. పాతికేళ్లలో చాలా కథలు రాసి, ప్రచురించి వుంటారు. బహుశా ఎంపిక చేసిన వాటినే యిక్కడ పొందుపరిచారనుకుంటాను. రచయితకి యిలాంటి సంయమనం చాలా అవసరం. ఒక్కోసారి తాత్కాలిక స్పృహతో కథని గిలుకుతాం. అప్పటికి అది బావుంటుంది. తరువాత సందర్భం మరుగున పడి ఆ కథ నేటి చదువరులకు ''పజిల్‌''గా మారుతుంది.

ఆలస్యంగానైనా ఒక మంచి కథా సంపుటి మిత్రులు ఆకెళ్ల శివప్రసాద్‌ నుంచి రావడం నాకు ఆనందంగా వుంది. ప్రతి కథలోనూ మంచి మంచి వాక్యాలను మోసుకెళ్లే కాగితం పడవలు కనిపిస్తాయి. పాఠకులు కిటికీలోంచి వానని, పడవల్ని శ్రద్ధగా గమనించండి.

ఆకెళ్ల శివప్రసాద్‌ మరికొన్ని మంచి కథలు మీకు అందిస్తాడని ఆయన పక్షాన నేను హామీ యిస్తున్నాను. అభినందిస్తున్నాను. అందుకు తగిన లిపిని వీరికి సరస్వతి అనుగ్రహించాలని కోరుకుంటున్నాను.

- శ్రీరమణ

Preview download free pdf of this Telugu book is available at Kitikilonchi Vana