“మిస్టర్ షాడో, మన పోలీసు బృందం ఏమీ చేయలేక పోయింది. స్పెషల్ బ్రాంచి తన అసమర్థతను వ్యక్తం చేసింది. ఇక చూస్తూ వూరుకోవడం అంటే భారతభూమిని చేతులారా పరులకు అప్పగించడం లాంటిది.”
“ఈ ఘాతుకాల వెనుక వున్న వారు ఎవరయినా..... సంఘంలో వారికి ఎటువంటి స్థానంవున్నా వెతికి పట్టుకుని బయటకు లాగాలి. అది అసాధ్యం అయిన పక్షంలో వారిని యీ భూమినుంచి తొలగించి వేయాలి.” ఆ వ్యక్తి గంభీర కంఠం ఆ గదిలో ప్రతిధ్వనించింది.
“వీలైతే ఆధారాలు వెతికి వారిని పోలీసులకు పట్టించు లేకపోతే కళ్ళు మూసుకుని..... నీకున్న కిల్లింగ్ మాస్టర్ అధికారాలను వుపయోగించి, వారిని అంతం చెయ్యి. కిల్ దెమ్ మిస్టర్ షాడో.. ఐ డోస్ట్ వాన్ట్ ఎనీథింగ్ మోర్.
నా ప్రజలు సుఖశాంతులతో జీవనం కొనసాగించాలి. నా దేశంలోని అన్ని జాతులు ఐకమత్యంతో మెలగాలి. ఈ విషయాలకు అడ్డుపడి, మన సమైక్యతకు భంగం కలిగించాలని ప్రయత్నించేవారిని క్షమించడంకూడా ఒక నేరమే మిస్టర్ షాడో - నువ్వు వెంటనే బయలుదేరి అక్కడికి వెళ్ళాలి. మన జాతి సమైక్యతను నాశనం చేయదలచిన ఆ చీడపురుగుల్ని...... వెతికి, వెతికి హతమార్చి గాని - వెనుతిరగవద్దు-”.
