-
-
ఖురాన్ పరిచయం
Khuran Parichayam
Author: Haji Mohammed Chanbasha
Publisher: Self Published on Kinige
Pages: 64Language: Telugu, English
మొదటిసారి ఖుర్ఆన్ గ్రంథాన్ని (అర్థము తెలుసుకుని) చదవదలచిన వారి మనస్సులో వచ్చే ప్రశ్నలకు జవాబులు తెలుసుకొనుట మేలు అనే ఉద్దేశంతో ఖుర్ఆన్ అపూర్వ విశేషాలు కొన్ని ప్రశ్న జవాబులు రూపంలో ఇవ్వబడ్డాయి.
దివ్య ఖుర్ ఆన్ సర్వలోకాల ప్రజలకోసం హిత బోధ (38:87 సాద్) అరబ్బీ భాషలో 610 - 632 A.D. సంవత్సరముల మధ్య కాలములో అవతరించినది. ప్రతి ముస్లిం ప్రార్థించుటకు కనీస అవసరమైన సూరాలు, దుఆ బాల్యం నుంచే కంఠస్తం చేసుకొంటారు. ఖుర్ఆన్ గురించి మరియు పఠించు విధానాల గురించి ఖుర్ఆన్లోనే పలు ఆదేశాలు పలుచోట్ల వివిధ రకాలుగా తెలుపబడ్డాయి.
ఉ॥ ‘‘లా అల్లకుం తాఖలూన్’’ (2:242), ‘‘లా అల్లకుం తజక్కరూన్’’ (2:221), ‘‘లా అల్లకుం తదబ్బరూన్....’’ (4:82), ‘‘వలఖద్ యస్సర్ నల్ ఖుర్ ఆన్ లిజ్ జిక్రి....’’ (54) వాటి అర్థాలు ‘‘ప్రతి ఆయత్ (ఖుర్ఆన్ వాక్యం) పై మనసు పెట్టి ఆలోచించండి, అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి, దీనిని ఆగి ఆగి నిదానముగా చదవండి. ఇందులో కల్పితములు లేవు, హితబోధ, గుణపాఠాలు మాత్రం ఉన్నవి. ఈ ఖుర్ఆన్ అవతరింప చేసినది మీరు కష్టాలలో పడడానికి కాదు. (Taha -2) ఖుర్ఆన్ అర్థం చేసుకొనుట చాలా సులభం చేశాము. మనస్సు ఉన్నవారికి సత్యము తెలుసుకొనగోరువారికి, ఇహ పర లోకాలలో విజయము, ఆనందము కోరువారికి’’.
ఖుర్ఆన్లో పఠించే ప్రతి అక్షరానికి పది పుణ్యాలు నమోదు అవుతాయి. వాటి అర్థం తెలుసుకొని అవగాహనతో పఠించితే మరి ఎన్నో రెట్లు ఎక్కువ పుణ్యము దక్కును మరియు విజయం తథ్యం. ఖుర్ఆన్ అవగాహన అర్థం మనస్సు, (హృదయం) ఉన్న మనుషులు, సత్యము తెలుసుకొనగోరు వారికి అల్లాహ్ చాలా సులభతరం చేశాడు అని ఖుర్ఆన్ పలుమార్లు వక్కాణించుచున్నది. (సూరె ఖమర్)
ఖుర్ఆన్ ఆయత్లు అరబ్బీ భాషలో ప్రస్ఫుటమైనవి. వాటి అర్థాలు మనం మన స్వభాష (మాతృభాష)లో చదివి, లేక విని తెలుసుకొనవచ్చును. తమ మాతృభాషను అర్థమైనట్టు ఇతర భాషలలో ఎంత నేర్పు ఉన్నా గ్రాహ్యం చేసుకొనుట సులభం కాదు కదా! కంఠస్థం అయినదానికంటే అర్థం తెలిసి పఠించిన కోటిరెట్లు అధిక గుణం కలుగుతుంది. దానిని ఆచరించితే అనంత గుణం కలుగుతుంది. (స్మృతివాక్యం ఋగ్వేదం X.71.4.5)
రోజూ ప్రార్థనలలో (నమాజ్) సలాహ్లో పఠించే సూరహ్ల అర్థసారం వాటి ప్రాముఖ్యత, అవతరించిన కాల పరిస్థితులు చరిత్ర తెలుసుకొనదలచిన వారికోసమే ఈ చిరు ప్రయత్నం.
Excellent!
Good Initiative to spread the meaning of Quraan.
All the best!
A very good informative
Great work all the best for the further books regards salmashafi
thankyou very much sir... on behalf of everyone who loves HOLY "QURAN"