• Khanda Kavyamu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఖండకావ్యము

    Khanda Kavyamu

    Pages: 84
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఖండ కావ్యము

Desineni

రచన: కీ. శే. దేశినేని వేంకట్రామయ్య




ఖండ కావ్య రచనలో శ్రీ దేశినేని వేంకట్రామయ్యగారు దర్శింపజేసిన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, మా వేంకటేశ్వర స్వామి, బుద్ధ దేవుడు, గాంధీ, వివేకానందుడు, అశోకుడు, ఖడ్గ తిక్కన, ఝాన్సీరాణి, బ్రహ్మనాయుడు, మాంచాల, పల్నాటి రాజకీయం, కర్షక పాత్రలు బహు విజ్ఞానపూరితములు, సంక్షిప్తములు. పాత్రల ఔచిత్యాన్ని దృష్టినిడి వర్ణనలు కొనసాగినవి. మా వేంకటేశ్వర స్వామి వర్ణన ప్రత్యేకాకర్షణ.

కవిగారు నిత్య హరినామ సంకీర్తనాచార్యునిగా పేరొందియుండి నిశ్శంక మదితో ఈ ఖండ కావ్యమును
కం. శ్రీ ఖండ కావ్యమును నే
నాఖండలు సఖ రచించినాడను దీనిన్
శేఖర గతిగైకొని గుణ
శేఖర మన్నింపు నన్ను శ్రితజన వంధ్యా!
అను అంకిత పద్యముతో శ్రీశునియెడ అవ్యాజమైన భక్తిని ప్రదర్శించుచునే తమకున్న సాంగత్యమును సఖ లాంటి పదప్రయోగము చేసి తన జీవితకాలమున తా జేసిన వాజ్ఞ్మూలములకు అస్తిత్వము కల్గించారు.

ఉదాహరణకు అప్పటి రామరాజ్యమును వర్ణించుచూ తన కనీస అభీష్టమును వర్ణించుచూ
ఉ. అప్పుడు నీదు రాజ్యమున నందము చందము లేకపోయినన్
గొప్ప కులాన బుట్టకొక కూళగ బుట్టిన విద్యలందు నే
ర్పొప్పి సభాంతరాళముల నొప్పులు దిద్దక పోయినన్ యెదో
చొప్పున బుట్టనైతిగద చూడగ నామది జాలిదూలెడిన్
లాంటి నిరుపమానమైన వర్ణనల భూయిష్టము యీ ఖండకావ్యము. ఇట్టి కథానికలు మానవజీవితమున మననము చేయుట సత్సమాజ పురోభివృద్ధికి ఎంతైనా ఆవశ్యకమని భావన. ఈ వర్ణనలు సంక్షిప్తముగానుండి సరళమైన తెలుగుభాషలో రచించబడుటచే మరియు ప్రస్తుతము తెలుగుబాషాభివృద్ధికి జరుగుచున్న కృషిదృష్ట్యా విద్యాబోధనలో ఉపయోగకారియై, విద్యార్ధులను మెఱుగైన రీతిలో నవనవోన్నత శిఖరాల నధిగమించు త్రోవలో మార్గదర్శకత కలిగించగలదని భావన.

గమనిక: ఈ "ఖండకావ్యము" ఈ-బుక్ సైజ్ 8.33 MB

Preview download free pdf of this Telugu book is available at Khanda Kavyamu