-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
ఖమ్మం జిల్లా బంజార పండుగలు (free)
Khammam Zilla Banjara Pandugalu - free
Author: Dr. G. Venkata Lal
Publisher: Self Published on Kinige
Pages: 136Language: Telugu
ప్రపంచ వ్యాప్తంగా అనేక గిరిజన తెగలున్నప్పటికీ, బంజార తెగ ప్రధాన తెగ. వీరి సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, వేషభాషలు అంతా కూడా అన్ని ప్రాంతాలలో కొద్ది మార్పులతో కన్పిస్తాయి. అమెరికాలో జిప్సీలన్నా, ఆంధ్ర, రాయలసీమలలో సుగాలీలన్నా, తెలంగాణలో బంజార, లంబాడీలన్న ఒకటే. ఖమ్మం జిల్లాలో లంబాడీలన్న పేరే చెలామణిలో ఉన్నప్పటికి, రాష్ట్రం అంతా 'బంజార' అనే పదం చెలామణిలో ఉన్నందున నా పరిశోధన అంశాన్ని 'ఖమ్మం జిల్లా బంజారా పండుగలు' అనే శీర్షికను ఎంచుకున్నాను.
ఆధునిక సమాజంలో అంతరించిపోతున్న తమ సంస్కృతి సంప్రదాయాలలో భాగమైన ఈ పండుగలను బంజార సమాజానికి, ముందుతరం బంజారులకు అందించటమే ఈ పరిశోధన లక్ష్యం.
'ఖమ్మం జిల్లా బంజారా పండుగలు' అనే ఈ పరిశోధన వ్యాసాన్ని మూడు అధ్యాయాలుగా విభజించాను. మొదటి అధ్యాయంలో ఖమ్మంజిల్లా భౌగోళికాంశాలు, చరిత్రనూ, రెండవ అధ్యాయంలో బంజారుల పుట్టుక - చరిత్రనూ, మూడవ అధ్యాయంలో ఖమ్మంజిల్లా బంజారా పండుగలలో ప్రధాన, అప్రధాన పండుగలను వివరించటం జరిగింది.
- డా. జి. వెంకట లాల్
Nice book. Good research work of Banjara cultures and festivals.