• Kenya To Kenya
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 81
    90
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కేన్యా టు కేన్యా

    Kenya To Kenya

    Author:

    Pages: 168
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

‘‘కెన్యా టు కెన్యా’’ కథల సంపుటిలో 15 కథలున్నాయి. ఇందులోని కథలన్నిటినీ రచయిత తన చుట్టూ ఉన్న ఎన్నో జీవితాలను అధ్యయనం చేసి రాసాడనిపిస్తుంది. విదేశాలలో పనిచేసే వారి జీవితాలు చాలా సౌకర్యవంతంగా (లెగ్జరీగా) ఉంటాయని మన దేశం వారు భావిస్తారు. కాని వారి ఉద్యోగ, ఆర్థిక, కుటుంబ జీవన భద్రత విషయాలను చాలా దగ్గరనుండి గమనించిన వాళ్ళకే తెలుసుంది అందులోని నిజమెంతో. పైన తెలిపిన విషయాలన్నింటిని చాలా చక్కగా కథలలో నిక్షేపించాడు రచయిత. రచయిత విద్యా, వృత్తి అంతా కూడా విదేశాలలో కొనసాగింది, కొనసాగుతుంది. ఈ కథలలోని వస్తువులకు వారు జీవిస్తున్న ప్రాంతీయ నేపథ్యం, వారు చూసిన సంఘటనలు ఆధారం కావచ్చు.

వీరి కథలలో వినూత్నమైన, టక్కున మలుపు తిరిగే విధంగా సాగిపోయే ధోరణి కనిపించదు. చాలా నిదానంగా కథ సాగుతూ ఉంటుంది. కథలోని పాత్రల భౌతికావసరాల కోసం మానసిక సంసిద్ధతలను ఏర్పరుస్తూ, ఏదీ కూడా తను నిర్ణయాధికారిగా వ్యవహరించకుండా చివరకు పాఠకుని ఊహకు వదిలేస్తాడు. భాషా విషయంలో చాలా సులభమైన శైలినే వాడడం కనిపిస్తుంది. వాక్యాలలో గాని, పదాలలో గాని కాఠిన్యత, నిర్వచించలేని గూఢత అంతగా కనిపించవు. రచయిత ఎక్కువ శాతం సంభాషణాత్మకంగానే కథను నడిపిస్తాడు.

కథ ఎత్తుగడ నుంచే పాత్రల ప్రవేశం కనిపిస్తూ ఆయా పాత్రలగురించి పరిపూర్ణంగా పరిచయం చేయడం కనిపిస్తుంది. ఆయా పాత్రలు ఏ సంఘటనల్లో, సందర్భాల్లో చిక్కుకున్నాయో పాఠకునికి స్పష్టంగా తెలియాలి అన్న ఆలోచనాధోరణి రచయితలో కనిపించడం ఇందుక్కారణం కావచ్చు. కథల్లో ‘ఏకాంశ వ్యగ్రం, స్వయం సమగ్రం’ అనే లక్షణాలుండాలి వీరి కథల్లో ఈ లక్షణాలు పరిపూర్ణంగా కనిపిస్తాయి. కథలకు సంక్షిప్తత కూడా మరో లక్షణం. అయితే ఈ లక్షణం కొన్ని కథల్లో కనిపించదు. కొన్ని కథలు స్కోప్ (పరిధి) దాటి నవలికకు దగ్గరగా వెళుతున్నట్లనిపిస్తుంది. ఉదా: సుచిత్రాచంద్ర, కెన్యా టు కెన్యా. శిల్పరిత్యా చూస్తే ప్రతీకాత్మకంగా రాసిన ‘గింజలు’ అనే కథా కవిత్వానికి దగ్గరగా ఉన్న కథలాగా అనిపిస్తుంది.

Preview download free pdf of this Telugu book is available at Kenya To Kenya