-
-
కీళ్ళ నొప్పులు మీ సమస్య అయితే...
Keella Noppulu Mee Samasya Ayite
Author: K. Manikyeswara Rao
Publisher: Mohan Publications
Pages: 136Language: Telugu
కీళ్లనొప్పులు మన సమాజంలో ఒక విడదీయరాని సమస్యగా మారిపోతున్నాయి. చాల మందిలో ఇవి వయసుతోపాటు వచ్చేవిగా అనుకుని ఎవరి సలహా తీసుకోవడం లేదు. తీసుకున్నా అప్పటికి ఆలస్యం అయిపోతుంది. ఇంకొంత మంది ఎదో ‘నొప్పిబిళ్ల’ వేసుకుని అదే వైద్యం అనుకుంటున్నారు. అలా చీటి లేకుండా షాపుల్లో మందులు వేసుకునే వారి సంఖ్య సాధారణంగా చాలా హెచ్చుగా ఉంటుంది. అలాగే వాటితో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్‌తో కూడా చాలామంది బాధపడుతూ ఉన్నారు. ఒకసారి వస్తే ఇక తగ్గవు అనే ఫీలింగ్‌తో కూడా చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరికీ అసలు కీళ్ళనొప్పులు అంటే ఏమిటి, ఎందుకు వస్తాయి. ఎలా తగ్గుతాయి. మందులు ఏమున్నాయి. రకరకాల చికిత్సలు ఏమిటి ఆధునిక వైద్యంఏం చెబుతుంది. ఆయుర్వేదం ఏం చెప్పింది. యోగని ఎంత వరకూ ఉపయోగించుకోవచ్చు. అనే దృక్పధం లోంచి వచ్చింది ఈ పుస్తకం అల్లోపతి వైద్య విధానం చాలా అభివృద్ధి చెందింది. కానీ దాని పరిమితులు దానికి ఉన్నాయి. అదే కూలంకుషంగా ఈ పుస్తకంలో వివరించాను. ఆయుర్వేదం కొంత చెప్పింది. యోగలో కొంత ఉపయోగం ఉంది. వీటిని సరిగా మిళితం చేసి చికిత్స జరిగితే ఎన్నోఫలితాలు ఉంటాయి నా ప్రగాఢ విశ్వాసం.
- మాణిక్యేశ్వరరావు

- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE