• Kavyanandanam Rendava Samputam - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • కావ్యనందనం - రెండవ సంపుటం (free)

    Kavyanandanam Rendava Samputam - free

    Publisher: Palapitta Books

    Pages: 439
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇది నేను వ్రాసిన ఛందోబద్దమైన కావ్యపరంపరలో రెండవ సంపుటము. ఇందులో రెండు భాగములున్నవి. మొదటి భాగములో నేను మొట్టమొదటిగా 1994లో ప్రచురించిన "మహాశిల్పి జక్కనచరిత్రము” అను కావ్యము యొక్క పునర్ముద్రణమున్నది. మొదటి ముద్రణలో క్వాచిత్కముగా నున్న దోషములిందులో సవరింపబడినవి. రెండవ భాగములో నేను 1984లో మొట్టమొదట ప్రచురించిన "హనుమప్పనాయకుడు' అను కావ్యమున్నది. మొదటి ముద్రణలో దొరలిన అనేకముద్రణదోషము లిందులో సవరింపబడినవి. మునుపటి ముద్రణదోషముల పరిహరణము, రసభావౌ చిత్యముల దృష్ట్యా మునుపటికంటె సరసమని తోచిన కొన్ని పదబంధముల మార్పులు ఈ ప్రచురణములలో నున్నను, పూర్వము ఈ కావ్యములపై వ్రాసిన పండితులయొక్క అభిప్రాయముల నివి ఇసుమంతయు మార్చలేకున్నవి. అందుచేత, లోగడనున్న ముఖ్యమైన పీఠికలను, అభిప్రాయములను యథాతథముగా ఈ ప్రచురణములోను ముద్రించడమైనది. అంతేకాక ఈ రెండు కావ్యముల సమగ్ర సంపుటిపై ఆంధ్రాంగ్లగీర్వాణ భాషాకోవిదులు, కాకతీయ విశ్వవిద్యాలయ విశ్రాంతాంగ్లభాషాచార్యులు, మీదు మిక్కిలి నా శ్రేయోభిలాషులైన శ్రీ లక్ష్మణమూర్తిగారు ఇంగ్లీషులో వ్రాసిన ఉపోద్ఘాత మిందులో నూతనముగా చేర్చబడినది.

- తిరుమల కృష్ణదేశికాచార్యులు