• Kavyanandanam Modati Samputam - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • కావ్యనందనం - మొదటి సంపుటం (free)

    Kavyanandanam Modati Samputam - free

    Publisher: Palapitta Books

    Pages: 358
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇది నేను వ్రాసిన ఛందోబద్ధమైన కావ్యపరంపరలో మొదటి సంపుటం. ఇందులో మూడు భాగములున్నవి. మొదటిభాగం పేరు కవితాస్రవంతి. దీనిలో సంస్కృతిఖండం, ప్రకృతిఖండం అను రెండు ప్రకరణములున్నవి. సంస్కృతిఖండంలో తెనుగు సంస్కృతికి, చరిత్రకు సంబంధించిన ఇరవై మూడు ఖండికలున్నవి. ప్రకృతిఖండంలో ప్రకృతికి సంబంధించిన వివిధ వర్ణనలు గల ఇరువది రెండు ఖండికలున్నవి. ఈ వర్ణనలు భారతదేశము నందలి ప్రకృతికే పరిమితంగాక, నేనుండే కెనడా దేశంలోని ప్రకృతివర్ణనాంశాలను కలిగియుండుట ఒక విశేషము. అసినబోయినోద్యానవనము, విరుల పాట, హిమపాతము, పత్తపతనకాలము అనే ఖండికలు స్పష్టంగా కెనడాలోని ప్రకృతిదృశ్యాలను, సంస్కృతిని దర్శించి కూర్చిన వర్ణనలే. ప్రకృతి వర్ణనలను కేవలం ప్రకృతియొక్క అందచందాలనుగూర్చి చెప్పుటకే కాక, ఆ వర్ణనల ద్వారా మానవప్రకృతులకు వర్తించే సందేశాల నందించడం ఒక లక్ష్యంగా పెట్టుకొని వ్రాసిన ఖండికలివి.

సంస్కృతిఖండంలోని మేఘాంగన, గానభారతి, చతురదూతిక, శరణాగతి, మాధవీమధుసేనము, సిరిపాలుడు అనే ఖండికలు పద్యకథాని కలని చెప్పుకొనవచ్చును. ఇవి కుంచింపబడిన హ్రస్వకావ్యాల వంటివి. కావ్యాలలో సుప్రసిద్ధమైన వర్ణనలు నాతివిస్తృతంగా కథాశరీరంతో పెన వేసుకొని వీటిలోనుండుట గమనింపగలరు. సుదీర్ఘములైన కావ్యాలను చదువుటకు ఓపికా, సమయమూ లేనివారు ఈ పద్యకథానికల ద్వారా కొంతవఱకు కావ్యలక్షణములనుగ్రహింపగలరని నా యాశ.

- తిరుమల కృష్ణదేశికాచార్యులు