• Kavyadahanotsavam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కావ్యదహనోత్సవం

    Kavyadahanotsavam

    Pages: 79
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

14-12-1960న కావ్యదహనోత్సవ కార్యక్రమం, ఆంధ్రవిశ్వకళాపరిషత్తు అవరణలో, బహిరంగ కళామండపంలో దిగ్విజయంగా జరిగింది. సుమారు ఒక వెయ్యిమంది విద్యార్థులు, మేస్టర్లు, పురజనులు హాజరయ్యారు. సభకి వచ్చిన పెద్దల్లో వేణుగోపాలస్వామిగారు. వివిధ శాఖల్లో పనిచేసే ప్రొఫెసర్లూ, విశాఖపట్టణం నుండి, రావిశాస్త్రిగారు, అయన స్నేహితులు చాలామంది సభకి వచ్చారు. చాలామంది విద్యార్థులు, ‘పుస్తకం తగలబెడతారు. చోద్యం చూద్దాం.' అన్న ఆశతోటే సభకి వచ్చారు. ఎప్పుడయితే ప్రత్యక్షంగా పుస్తకదహన కార్యక్రమం జరగలేదో, అందుకు నిరాశాపూరితులైన మాట వాస్తవం. ఆహ్వానపత్రం తెలుగునాట చాలామంది రచయితలకి, కవులకీ, మెయిల్‌లో పంపించాం. శ్రీశ్రీ ఒక్కరే మాకు, 'Wish cremation success' అని తంతి పంపించారు. కాని, ఆ తంతి అరోజున స్టేజీపై చదవటానికి వీలు కుదరలేదు. కారణం: తంతిశాఖ వారు దానిని, రిజిస్ట్రార్ ఆఫీసులో అందజేశారు.

అధ్యక్షులుగా మేడేపల్లి వరాహనరసింహస్వామిగారు వేదికమీద ఉండటం సభకి ఒక ప్రత్యేక గౌరవం లభించింది. చేకూరి రామారావు (తెలుగు విభాగంలో విద్యార్థి అని ఇదివరకే చెప్పాను) ఆఖరి క్షణంలో, అతను చెయ్యవలసిన ఉపన్యాసం చెయ్యలేదు. సభలో, శ్రీనివాసాచార్యులగారి పక్కనే కూర్చొని ఉన్నాడు. తరువాత తెలిసిన విషయం: శ్రీనివాసాచార్యులుగారు తెలుగు విభాగంలో పనిచేసే ప్రొఫెసర్లని సభలో చూసి, ఆఖరి క్షణంలో రామారావుని ప్రత్యక్షంగా ఈ సభలో పాల్గొనవద్దని వారించారు. అతని ఉపన్యాసం, నా స్నేహితుడు సి. సత్యనారాయణ చదివాడు. అతనే, శ్రీశ్రీ రాసిన 'చేదు పాట, చేదు నిజం, ఔను నిజం... ప్రార్థన పద్యంగా చదివాడు. 'కుక్కలవలె, నక్కలవలె! మనదీ ఒక బ్రతుకేనా? సందులలో పందులవలె! అన్న చరణాలు చదవటం మొదలవగానే, ప్రేక్షకులందరూ నవ్వుకుంటూ కూచున్నారు; స్టేజీమీద ఉన్నవారు మినహా!

ఈ పుస్తకంలో, చేకూరి రామారావు స్టేజీమీద ‘స్వయంగా’ చెయ్యని ఉపన్యాసం పూర్తిపాఠం కూడా సంపూర్ణత కోసం పొందుపరిచాను.

- వేలూరి వేంకటేశ్వర రావు

గమనిక: " కావ్యదహనోత్సవం " ఈబుక్ సైజు 23.6mb

Preview download free pdf of this Telugu book is available at Kavyadahanotsavam